Virat Kohli : ఐపీఎల్ చరిత్రలో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం పడిగాపులు కాస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి టైటిల్‌ను గెలుపొందింది. ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఇదే మొదటి ట్రోఫీ. దాంతో, అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ లెజెండరీ ఆటగాడు ఉబికివస్తున్న కన్నీళ్లను దాచలేకపోయాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగులతో బెంగళూరు విజయం సాధించగానే విరాట్ తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.పట్టలేనంత సంతోషంతో మైదానంలోనే కూలబడిపోయి.. ఈ నేలకు వందనం.. అంటూ నమస్కరించాడు. అనంతరం తన మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్‌ను హత్తుకున్న కోహ్లీ.. భార్య అనుష్క శర్మ(Anushka Sharma)కు బిగ్ హగ్ ఇచ్చి తన జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
The tears say it all 🥹
An 1️⃣8️⃣-year wait comes to an end 👏
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @imVkohli pic.twitter.com/X15Xdmxb0k
— IndianPremierLeague (@IPL) June 3, 2025
‘ఈ విజయం నాకే కాదు అభిమానులకు, మా జట్టుకు ఎంతో ప్రత్యేకం. 18 ఏళ్ల మా కల సాకారమైంది. ఆర్సీబీ విజయం కోసం నేను చేయాల్సిందంతా చేశాను. ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. హేజిల్‌వుడ్ చివరి బంతి వేశాక జట్టలోని ప్రతిఒక్కరం ఎంతో భావోద్వేగానికి లోనయ్యాం. ఆరంభ సీజన్ నుంచి నేను ఆర్సీబీకే ఆడుతున్నా. నా హృదయం ఎప్పుడూ బెంగళూరుతోనే ఉంటుంది. ఈరోజు రాత్రి నేను చిన్నపిల్లాడిలా హాయిగా నిద్రపోతాను’ అని కోహ్లీ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి కోహ్లీ ఆర్సీబీని అట్టిపెట్టుకొని ఉన్నాడు. ఫెయిల్యూర్ టీమ్ అనే ముద్ర పడినా సరే అతడు మాత్రం బెంగళూరును మాత్రం వీడలేదు. 2016లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన విరాట్.. టైటిల్ కరువు మాత్రం తీర్చలేకపోయాడు. 17వ సీజన్ ముందు కెప్టెన్సీ వదులుకున్న విరాట్.. ఒత్తిడి లేకుండా ఆడడం మొదలెట్టాడు. 18వ సీజన్లో 8 అర్ధ శతకాలతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతడు.. ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్న 43 పరుగులతో జట్టు భారీ స్కోర్‌లో భాగయ్యాడీ రన్ మెషీన్. 191 రన్స్ ఛేదనలో పంజాబ్‌ను 184కే కట్టడి చేసిన ఆర్సీబీ తొలిసారి విజేతగా అవతరించింది.