IPL 2025 : ఐపీఎల్లో ఛాంపియన్‌గా నిలవాలనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కల నెరవేరింది. మూడుసార్లు ఆఖరి మెట్టుమీద తడబడిన ఆర్సీబీ ఎట్టేకేలకు ట్రోపీని ముద్దాడింది. అహ్మదాబాద్‌లో ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను 6 పరుగుల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది. విరాట్ కోహ్లీ(43), జితేశ్ శర్మ(24) మెరుపులతో 190 రన్స్ కొట్టిన బెంగళూరు.. కృనాల్ పాండ్యా(2-17) రాణించడంతో పంజాబ్‌ను కట్టడి చేసింది. శశాంక్ సింగ్(61 నాటౌట్) చివరిదాకా పోరాడినా ఓటమిని తప్పించలేకపోయాడు. చివరి ఓవర్లో శశాంక్ 22 సిక్సర్లతో చెలరేగినా.. బెంగళూరు విజయం ఖాయమైంది.
ఈ సాలా కప్ నమదే అంటూ ఐపీఎల్ బరిలో నిలిచే ఆర్సీబీ తమ కలను సాకారం చేసుకుంది. ఆరంభ సీజన్ నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షిలా ఎదురుచూసిన ఆ జట్టు 18వ సీజన్లో ఛాంపియన్‌గా అవతరించింది. ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దాంతో, రెండోసారి ఫైనల్ చేరిన పంజాబ్‌కు గుండెకోత తప్పలేదు.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 𝐎𝐅 #𝐓𝐀𝐓𝐀𝐈𝐏𝐋 𝟐𝟎𝟐𝟓 🏆🤩
The ROYAL CHALLENGERS BENGALURU have done it for the first time ❤#RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets pic.twitter.com/x4rGdcNavS
— IndianPremierLeague (@IPL) June 3, 2025
బెంగళూరు నిర్దేశించిన భారీ ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రియాన్ష్ ఆర్య(24) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే.. ప్రభ్‌సిమ్రన్(26) సింగ్‌కు 9 పరుగుల వద్ద లైఫ్ లభించింది. హేజిల్‌వుడ్ ఓవర్లో అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను షెపర్డ్ నేలపాలు చేశాడు. చేతుల్లో పడిన బంతిని ఒడసి పట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత హేజిల్‌వుడ్ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదిన ప్రియాన్ష్.. చివరకు అతడి ఓవర్లోనే వెనుదిరిగాడు. పవర్ ప్లేలో 52 రన్స్ చేసిన పంజాబ్ పటిష్ట స్థితిలో ఉంది. కానీ, కృనాల్ పాండ్యా ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ భువనేశ్వర్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (1) నిరాశపరిచాడు. క్వాలిఫయర్ 2లో అజేయ అర్థ శతకంతో జట్టును గెలిపించిన అతడు షెపర్డ్ బౌలింగ్‌లో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా ఆడబోయి వికెట్ కీపర్ జితేశ్ చేతికి చిక్కాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఇంగ్లిస్‌ను కృనాల్ ఔట్ చేయగా 94 వద్ద నాలుగో వికెట్ పడింది.
The tears say it all 🥹
An 1️⃣8️⃣-year wait comes to an end 👏
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @imVkohli pic.twitter.com/X15Xdmxb0k
— IndianPremierLeague (@IPL) June 3, 2025
ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరగా ఒత్తిడిలో పడిన పంజాబ్‌ను గెలిపించే బాధ్యత తీసుకున్నారు. అప్పటికీ విజయానికి 42 బంతుల్లో 90 పరుగులు కావాలి. ఆ దశలో షెపర్డ్ ఓవర్లో నేహల్ వధేరా(15)లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదాడు. అనంతరం హేజిల్‌వుడ్ వేసిన 16 వ ఓవర్లో స్లో బాల్‌ను శశాంక్ సింగ్(61 నాటౌట్ ) అలవోకగా స్టాండ్స్‌లోకి పంపాడు. చివరి బంతిని కూడా సిక్సర్‌గా మలవడంతో వరుసగా రెండు ఓవర్లలో 13 రన్స్ వచ్చాయి. ఐదో వికెట్‌కు 38 రన్స్ జోడించిన నేహల్‌ను భువీ ఔట్ చేసి.. మార్కస్ స్టోయినిస్(6)ను కూడా వెనక్కి పంపి ఆర్సీబీని పోటీలోకి తెచ్చాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్(0)ను దయాల్ డకౌట్ చేయగా పంజాబ్ ఓటమి అంచున నిలిచింది. చివరి రెండు ఓవర్లలో 42 రన్స్ అవసరం కాగా.. శశాంక్ సింగ్(0) సిక్సర్లతో చెలరేగాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో 6, 4, 6, 6 బాది అర్ద శతకం సాధించాడు. కానీ, ఆర్సీబీ 6 పరుగుల తేడాతో ఛాంపియన్‌గా అవతరించింది.
ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. పంజాబ్ కింగ్స్ పేసర్ కైలీ జేమీసన్(3-48), అర్ష్‌దీప్ సింగ్(3-40)లు విజృంబించడంతో పెద్ద స్కోర్ చేయలేకపోయారు. డేంజరస్ ఫిల్ సాల్ట్(16)విఫలం కాగా.. రజత్ పాటిదార్(26)ను ఔట్ చేసిన జేమీసన్ బెంగళూరును దెబ్బకొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా విరాట్ కోహ్లీ(43) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. డెత్ ఓవర్లలో జితేశ్ శర్మ (24), ధనాధన్ ఆడాడు.
విరాట్ కోహ్లీ(43)
జేమీసన్ వేసిన 17వ ఓవర్లో.. రెచ్చిపోయిన జితేశ్ మూడు సిక్సర్లతో 23 రన్స్ పిండుకున్నాడు. అతడి మెరుపులతో ఆర్సీబీ స్కోర్ 170కి చేరుకుంది. మరో మూడు ఓవర్లు ఈ ఇద్దరూ నిలబడితే 200 ప్లస్ ఖాయం అనిపించింది. కానీ, జేమీసన్ ఓవర్లో లివింగ్‌స్టోన్ ఔట్ కాగా.. ఆ తర్వాత జితేశ్‌ను విజయ్‌కుమార్ బౌల్డ్ చేసి ఆర్సీబీ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే.. అజ్మతుల్లా వేసిన 19వ ఓవర్లో రొమారియో షెపర్డ్(17) వరుసగా 4, 6 బాదాడు. కానీ, అర్ష్‌దీప్ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయడంతో ఆర్సీబీ 190కే పరిమితమైంది.