IPL 2025 | సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్.. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్ !
IPL 2025 : ఐపీఎల్ తొలి కప్ వేటలో ఉన్న పంజాబ్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. భారీ ఛేదనలో ప్రియాన్ష్ ఆర్య(24), ప్రభ్‌సిమ్రన్ సింగ్(15 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. కానీ, హేజిల్‌వుడ్ ఆర్సీబీకి తొలి బ్రేక్ ఇస్తూ ప్రియాన్ష్‌ను ఔట్ చేశాడు.
IPL 2025 : ఐపీఎల్ తొలి కప్ వేటలో ఉన్న పంజాబ్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. భారీ ఛేదనలో ప్రియాన్ష్ ఆర్య(24), ప్రభ్‌సిమ్రన్ సింగ్(15 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. కానీ, హేజిల్‌వుడ్ ఆర్సీబీకి తొలి బ్రేక్ ఇస్తూ ప్రియాన్ష్‌ను ఔట్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద పరుగెత్తుతూ బంతిని అందుకున్న సాల్ట్.. అవతలకు విసిరి మళ్లీ బయటకు వచ్చి క్యాచ్‌ను పూర్తి చేశాడు. అంతే.. ఆర్సీబీ ఆటగాళ్లు జోష్‌గా సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం జోష్ ఇంగ్లిస్(8), ప్రభ్‌సిమ్రన్‌తో కలిసి జట్టును గెలిపించే బాధ్యత తీసకున్నాడు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 52-1. ఇంకా 139 పరుగులు అవసరం.
బెంగళూరు నిర్దేశించిన భారీ ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు దంచి కొట్టారు. ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రియాన్ష్ ఆర్య(24) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే.. ప్రభ్‌సిమ్రన్(15) సింగ్‌కు 9 పరుగుల వద్ద లైఫ్ లభించింది. హేజిల్‌వుడ్ ఓవర్లో అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను షెపర్డ్ నేలపాలు చేశాడు. చేతుల్లో పడిన బంతిని ఒడసి పట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత హేజిల్‌వుడ్ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదిన ప్రియాన్ష్.. చివరకు అతడి ఓవర్లోనే వెనుదిరిగాడు.
Pause it. Rewind it. Watch it again 🫡
Phil Salt with a clutch grab under pressure ❤
Was that the game-defining catch? 🤔
Updates ▶ https://t.co/U5zvVhcvdo#TATAIPL | #RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets pic.twitter.com/o0gpkjLOCV
— IndianPremierLeague (@IPL) June 3, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

