అసలే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో కూడా అర్థం కావడం లేదు. తెలుగులో కూడా చాలా మంది ప్రముఖులు కన్నుమూశారు. నిన్నగాక మొన్న కత్తి మహేష్ కూడా మరణించాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో బాధాకరమైన వార్త బయటికి వచ్చింది. వైద్యానికి కూడా డబ్బుల్లేక సోషల్ మీడియా వేదికగా ఓ నటి తనను కాపాడాలంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా అయ్యో పాపం అనుకుంటున్నారు. ఆ నటి పేరు అనయా సోనీ. తెలుగు వాళ్లకు పరిచయం లేకపోయినా కూడా హిందీలో మాత్రం బాగానే పాపులర్ ఈమె. అక్కడ నామ్ కరణ్, క్రైమ్ పెట్రోల్ లాంటి క్రేజీ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అనయా.
కొన్నేళ్లుగా ఈమె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతుంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నపుడు సొంత డబ్బులతోనే వైద్యం చేయించుకుంది అనయా సోనీ. ఆరేళ్ల కిందే ఈమెకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. ఆ సమయంలో ఆమె తండ్రి ఓ కిడ్నీ దానం చేసాడు. ఇప్పుడు అది కూడా పని చేయడం మానేసింది. దాంతో కచ్చితంగా కిడ్నీ మార్పిడి చేయాల్సిందే..లేకపోతే బతకడం కష్టం అంటూ వైద్యులు కూడా తేల్చేసారు. ప్రస్తుతం ఈమె ముంబైలోని హోలీ స్పిరిట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం ఈమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆర్థికంగానూ ఇబ్బంది పడుతుంది సోనీ. ప్రస్తుతం ఈమె దగ్గర డబ్బుల్లేవు..కుటుంబమంతా పూర్తిగా పేదరికంలో వెళ్లిపోయింది.
కనీసం తినడానికి తిండి కూడా లేని గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ మధ్యే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి చెప్పుకుంది అనయా సోనీ. దాతల కోసం వేచి చూస్తున్నట్లు కన్నీటి పర్యంతమైంది. తనకు ఇప్పుడు కిడ్నీ మార్పిడి తప్ప మరో ఆప్షన్ లేదని.. దానికి చాలా డబ్బులు కావాలంటుంది అనయా సోనీ. మొన్నటి వరకు తన అమ్మకు ఓ క్లాత్ స్టోర్ ఉండేదని.. కానీ ఓ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయిందని.. ఇప్పుడు ఆధారం లేకుండా అయిపోయిందని చెప్పుకొచ్చింది అనయా సోనీ. తనకు డయాలసిస్ జరగాల్సి ఉందని.. కానీ కిడ్నీ దాత కోసం చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
ఐటెంసాంగ్ తో సన్నీలియోన్ సందడి
బీచ్లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
యూట్యూబ్లో అజిత్ ‘వలిమై’ రికార్డుల మోత
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి