టాలీవుడ్ ను కరోనా సెకండ్ వేవ్ మరోసారి షేక్ చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా విడుదల తేదీలు మార్చేసుకున్నారు దర్శకనిర్మాతలు. షూటింగ్స్ కూడా రద్దు చేసుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రవితేజ తన 2 సినిమాల షూటింగ్స్ ను రద్దు చేసుకున్నాడట. రవితేజ డైరెక్టర్ రమేశ్ వర్మకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో ఖిలాడి యూనిట్ చిత్రీకరణను క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం.
మరోవైపు కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా షూటింగ్ విషయంలో కూడా రవితేజ వెనక్కి తగ్గినట్టు టాక్. ఇటీవలే మహేశ్‌బాబు, రాంచరణ్ తమ సినిమాల యూనిట్ మెంబర్స్ కు కోవిడ్ నిర్దారణ అయిన నేపథ్యంలో షూటింగ్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ