సినిమాలే కాదు.. ట్రెండుకు తగ్గట్లుగా మారిపోవడంలో ఆర్జీవీ కంటే తోపు ఎవరూ ఇండస్ట్రీలో లేరు. ఆయన ఫ్లాపులు చేసినా.. హిట్లు తీసినా వర్మ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. వరుస సినిమాలు చేసే ఆర్జీవీ ఇప్పుడు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు. అది కూడా భార్యలు, వాళ్లలోని రకాల అనే కాన్సెప్ట్‌పై వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశాడు. స్త్రీల అసలు స్వరూపం వాళ్లు భార్యలుగా మారినప్పుడే విశ్వరూపమై బయటకు వస్తుందని అంటూ ఈయన చెప్తున్నాడు.
విభిన్నమైన కాన్సెప్ట్‌లతో సినిమాలు తెరకెక్కించే వర్మ.. ఇప్పుడు భార్యలపై పడ్డాడు. తాజాగా భార్యల అంశంపై వెబ్ సిరీస్ చిత్రీకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. భార్యలు.. వాళ్లల్లో రకాలు అనే అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని వెబ్ సిరీస్ చేస్తున్నాడు వర్మ. త్వరలో ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కబోతుంది. ఇందులో ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇదే విషయాన్ని తెలియచేస్తూ తాజాగా ఆర్జీవీ ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేశాడు.
ఎంతోమంది మహాకవులు స్త్రీల స్వరూపాన్ని వివిధ రకాలుగా అభివర్ణించారు.. కానీ కాలమానంలో ఎన్నో రకాలైన స్త్రీలు ఉద్భవిస్తారనే విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు’ అని ఆర్జీవీ ఈ సందర్భంగా తెలిపాడు. ఈ కాలంలోని భార్యల గురించి అందరికీ తెలియజేస్తూ ‘రకరకాల భార్యలు’ అనే పేరుతో సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపాడు. సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్లో ఒక్కోరకం భార్యని చూపించనున్నట్లు వివరించాడు. మొత్తానికి వర్మ యాంగిల్లో ఈ భార్య కోణం ఎలా ఉండబోతుందో అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
యషికా ఆనంద్ ఆరోగ్యం అత్యంత విషమం..!
రెయిన్ సాంగ్స్ కు నో అంటున్న ఇస్మార్ట్ భామ
‘నారప్ప’ కొడుకు శీనప్ప రోల్ చేసింది ఎవరో తెలుసా…?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?