జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ బాగానే నడుస్తుంది. ఇంత ఖరీదైన కారు ఇప్పటి వరకు మన హీరోలు ఎవరూ కొనలేదు. ప్రభాస్ రూ.4 కోట్ల కారు వాడుతున్నాడు. ఇప్పుడు జూనియర్ దాన్ని బీట్ చేస్తున్నాడు.

టాలీవుడ్ హీరోల్లో చాలా మందికి కార్లు మార్చే అలవాటు ఉంది. మార్కెట్ లోకి కొత్త కారు వస్తే ఇంటి ముందు ఉండాలనుకునే హీరోలు చాలా మంది ఉన్నారు మన దగ్గర. చిరంజీవి, శ్రీకాంత్ వంటి హీరోలకు ఈ కార్ల పిచ్చి ఎక్కువగా ఉంది. ఈ తరం హీరోలకు కూడా ఇదే అలవాటు వచ్చింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయి. ఈయన దగ్గర బ్రాండ్ న్యూ కార్స్ నుంచి ఓల్డ్ మోడల్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇప్పటికే ఈయన దగ్గర అరడజన్ వరకు కార్లు ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా మరో క్రేజీ కార్ సొంతం చేసుకున్నాడు తారక్. ఇటలీ నుంచి దీన్ని బుక్ చేశాడు. ఈ కారు బుక్ చేసిన మూడు నెలలకు ఇప్పుడు భారత్‌కు వచ్చింది. ఈ కారు వచ్చిన తర్వాత దీనిపైనే రామ్‌చరణ్ ఇంటికి వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్లో ఇంత ఖరీదైన కారు కొన్నది ముందు జూనియర్ మాత్రమే. ప్రభాస్ కూడా ఇదే కారు కొనుగోలు చేసినా కూడా దాని రేట్ తక్కువ. అంత ముచ్చటపడి తారక్ బుక్ చేసుకున్న ఆ కారు పేరు లంబోర్ఘిని ఉరుస్.. స్పోర్ట్స్ మోడల్ కారును ఆయన బుక్ చేశాడు. దీని ఖరీదు రూ.3 కోట్ల నుంచి మొదలవుతుంది. అయితే జూనియర్ తీసుకున్న మోడల్ మాత్రం రూ.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఐదుగురు కూర్చోడానికి వీలుండే ఈ కారు అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆల్ సర్ఫేస్ పర్పస్‌తో ఈ కారు మార్కెట్ లోకి వచ్చింది. అంటే ఎక్కడైనా దీన్ని ఎలాగైనా నడపొచ్చు ఏం కాదన్నమాట. మన రెగ్యులర్ రోడ్ల మీద మాత్రమే కాకుండా దట్టమైన ఎడారి.. కొండ ప్రాంతంలో కూడా ఈ కారులో అదిరిపోయే రైడ్ చేయొచ్చన్నమాట.
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ బాగానే నడుస్తుంది. ఇంత ఖరీదైన కారు ఇప్పటి వరకు మన హీరోలు ఎవరూ కొనలేదు. ప్రభాస్ రూ.4 కోట్ల కారు వాడుతున్నాడు. ఇప్పుడు జూనియర్ దాన్ని బీట్ చేస్తున్నాడు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఒక్కో సినిమాకు భారీగానే పారితోషికం అందుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
రాజమౌళి ‘బజరంగీ భాయ్‌జాన్’ ఛాన్స్ ఎలా మిస్సయ్యాడంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Shilpa Shetty | శిల్పా శెట్టిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా.. ముంబైలో హై డ్రామా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

