Shilpa Shetty | శిల్పా శెట్టిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా.. ముంబైలో హై డ్రామా..!
శిల్పా శెట్టి ఇంటి దగ్గర కూడా పోలీసుల సందడి కనిపిస్తుంది. ఈమెను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడిలో భారీగా పోర్న్ వీడియోలు బయటపడ్డట్లు తెలుస్తుంది.

పోర్న్ వీడియోల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులు ఈయన్ను హఠాత్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల కిందటే ఈయనపై పోర్న్ వీడియోల కేసు ఫైల్ అయింది. పోర్నోగ్రఫీ చేస్తున్నాడని.. అలాంటి సినిమాలు నిర్మిస్తున్నాడనే ఆరోపణలతో ఈయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అంతేకాకుండా రాజ్‌కుంద్రాతో సంబంధాలు ఉన్న అందర్నీ కూడా విచారిస్తున్నారు. బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వాళ్లతో పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి.
ఒప్పుకోని వాళ్లపై ఒత్తిడి కూడా చేస్తున్నారని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ కేసులో రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్న పలువురు సెలబ్రిటీలను కూడా కొన్ని రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పోలీసులకు కూడా షాక్ అయ్యే నిజాలు బయటికి వస్తున్నట్లు తెలుస్తుంది. మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు కస్టడీలోనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. జూలై 23 వరకు ఈయన పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.
మరోవైపు శిల్పా శెట్టి ఇంటి దగ్గర కూడా పోలీసుల సందడి కనిపిస్తుంది. ఈమెను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడిలో భారీగా పోర్న్ వీడియోలు బయటపడ్డట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈమెపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శిల్పా శెట్టిని అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
రాజమౌళి ‘బజరంగీ భాయ్‌జాన్’ ఛాన్స్ ఎలా మిస్సయ్యాడంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

