e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News 'పవర్ స్టార్‌'తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?

‘పవర్ స్టార్‌’తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?

'పవర్ స్టార్‌'తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?

అమ్మో.. ఇదేం సంచలనం.. ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? ఇక్కడ పవర్ స్టార్ అంటే మన పవన్ కళ్యాణ్ కాదు.. తమిళంలో కూడా ఒక పవర్ స్టార్ ఉన్నాడు. అయితే మన దగ్గర సంపూర్ణేశ్‌ బాబు ఎలా పేరడీ సినిమాలు చేస్తుంటాడో.. తమిళంలో కూడా ఒక హీరో అలాగే చేస్తూ ఉంటాడు. ఆయన పేరు శ్రీనివాసన్. సంపూ తనకు తాను బర్నింగ్ స్టార్ అని ఇచ్చుకున్నట్లు.. అక్కడ పవర్ స్టార్ అంటూ తనకు తాను ఒక బిరుదు ఇచ్చుకున్నాడు శ్రీనివాసన్. కామెడీ సినిమాలతో పాటు పేరడీ సినిమాలు కూడా బాగానే చేస్తుంటాడు ఈయన. గుర్తింపు కూడా ఆయనకు బాగానే ఉంది.

'పవర్ స్టార్‌'తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?

ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఒక హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అక్కడ ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే అందరూ షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఆమెకు ఇంతకు ముందే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తెలుగులో దేవి సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న వనిత విజయకుమార్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతేడాది కరోనా సమయంలో దర్శకుడు పీటర్ పాల్‌ను పెళ్లి చేసుకుంది వనిత. అయితే ఆయనతో మూడు నెలలు కూడా కాపురం చేయకుండానే విడాకులు ఇచ్చేసింది. అంతకు ముందు 2000లో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుని 2007లో విడిపోయింది. ఆ తర్వాత 2007లో బిజినెస్ మ్యాన్ ఆనంద్ జె రాజన్ ను పెళ్లి చేసుకుని 2012లో విడాకులు తీసుకుంది.

- Advertisement -

ఇక 2020లో పీటర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకుంది వనిత విజయ్ కుమార్. అతడితో కూడా విడిపోయింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ శ్రీనివాసన్ తో పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసింది. పైగా లవ్ సింబల్ కూడా పెట్టింది. దీంతో ఇప్పుడు ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. అయితే ఇదంతా ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా జరుగుతున్న స్టంట్స్ అంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ఈమెకు పెళ్లి అంటే కామెడీ అయిపోయింది అంటూ వనిత పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. దీనికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ప్రియ‌మణి-ముస్త‌ఫారాజ్ వివాహం చెల్ల‌దు..

సినిమాల‌కు యువ హీరో గుడ్‌బై..?

ఇంటి పేరు తెచ్చిన తంటా..క‌ర‌ణ్ కుంద్రాకు చిక్కులు

బాల‌కృష్ణను భ‌య‌పెట్టేది ఏంటో తెలుసా..?

నార‌ప్పలో ఆ విష‌యం వివాద‌మయ్యేనా?

రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్‌.. వీడియోలు ఎక్క‌డ తీశారు? ఎలా అప్‌లోడ్ చేశారు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
'పవర్ స్టార్‌'తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
'పవర్ స్టార్‌'తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
'పవర్ స్టార్‌'తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?

ట్రెండింగ్‌

Advertisement