RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
RRR Movie | ఈ సినిమా పోస్టర్లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్‌లో కనిపించాడు. చరిత్రను ఇక్కడ వక్రీకరిస్తున్నారని.. అసలు భీమ్ ఎలా ముస్లింగా మారాడని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ రోజుల్లో సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు కాంట్రవర్సీలు కూడా రెడీ అవుతుంటాయి. అందులోనూ ట్రిపుల్ ఆర్ వంటి చారిత్రక కథాంశాలతో సినిమాలు వస్తున్నాయంటే వివాదాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ సినిమాలో ఇద్దరు స్వతంత్ర సమరయోధుల కథలు ఉన్నాయి. ఒకరు కొమ్రంభీమ్ అయితే.. మరొకరు అల్లూరి సీతారామరాజు.. ఈ ఇద్దరి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అనగానే కాంట్రవర్సీలు వస్తాయనే రాజమౌళి.. ఇది పూర్తిగా కల్పిత గాథ అని అప్పట్లోనే ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చాడు. అయినా ముందు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్, టీజర్స్ చూసి పలువురు ఆక్షేపణలు చేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమాపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు వీరభద్రరావు అప్పట్లో ఫైర్ అయ్యాడు. చరిత్రని వక్రీకరిస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు చరిత్రను వక్రీకరించిన సన్నివేశాలు తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజమౌళిని కోరాడు. కేవలం డబ్బుల కోసం కమర్షియల్ పేరుతో స్వతంత్ర సమరయోధుల జీవితాలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టాడని.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న ఆంగ్లేయుల కాల్పుల్లో వీరమరణం పొందారని తెలిపాడు. అదే సమయంలో కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు తెలిపారు. ఇద్దరు కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని.. చరిత్రలో లేని విషయాలను సినిమాలో ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాడు. మరోవైపు రాజమౌళి మాత్రం ఇది పూర్తిగా కల్పితం అని.. 1920 ప్రాంతంలో ఒకవేళ ఇద్దరూ కలిసి ఉంటే ఎలా ఉండేది అనేది సినిమా కథ అంటున్నాడు. మొత్తానికి రాజమౌళి మల్టీస్టారర్‌పై కూడా వివాదాలు మొదలయ్యాయి.

ఇప్పుడు కొమ్రం భీమ్ అనుచరులు కూడా ఇలాగే వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ముస్లిం గెటప్‌లో కనిపించాడు. చరిత్రను ఇక్కడ వక్రీకరిస్తున్నారని.. అసలు భీమ్ ఎలా ముస్లింగా మారాడని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే రజాకార్ల నుంచి తప్పించుకునే క్రమంలోనే భీమ్ చాలా గెటప్స్‌లో కనిపించాడని.. అందులో భాగంగానే ఇలా కనిపించి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
రాజమౌళి ‘బజరంగీ భాయ్‌జాన్’ ఛాన్స్ ఎలా మిస్సయ్యాడంటే..?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR
- Rajamouli
- RRR
- telugu cinema
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

