యషికా ఆనంద్ ఆరోగ్యం అత్యంత విషమం..!
బిగ్ బాస్ బ్యూటీ, కాంట్రవర్సియల్ హీరోయిన్ యషికా ఆనంద్ యాక్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈమె పరిస్థితి ఎలా ఉందంటూ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తెగ వెతికేస్తున్నారు.

బిగ్ బాస్ బ్యూటీ, కాంట్రవర్సియల్ హీరోయిన్ యషికా ఆనంద్ యాక్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈమె పరిస్థితి ఎలా ఉందంటూ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తెగ వెతికేస్తున్నారు. అయినా ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో వరస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలోనే కొందరు ప్రముఖులు కూడా కన్నుమూస్తున్నారు. రీసెంట్ గా కన్నడలో జాతీయ ఉత్తమ నటుడు సంచారీ విజయ్..తెలుగులో ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇవి మరిచిపోకముందే అంతలోనే మరో ఘోరం జరిగింది.
తాజాగా మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రముఖ హీరోయిన్ యషికా ఆనంద్ తీవ్రంగా గాయపడింది. ఇదే ప్రమాదంలో ఈమె స్నేహితురాలు భవానీ స్పాట్ లోనే చనిపోయింది. వీకెండ్ కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి యాషిక మహాబలిపురం లాంగ్డ్రైవ్కి వెళ్లింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత వీళ్ళు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్ను ఢీ కొట్టింది. కళ్లు మూసి తెరిచేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో వాళ్ళతోపాటు ప్రయాణిస్తున్న భవానీ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యాషిక, ఆమె మరో ఇద్దరు స్నేహితులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.
ఇందులో యషికా పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈమె ప్రాణాలకు ఇప్పుడే గ్యారెంటీ ఇవ్వలేమని వైద్యులు చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఈమెను ఓ వైద్యబృందం ట్రీట్ చేస్తుంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో యషికా పరిస్థితి విషమంగా మారింది. దురవంగల్ పత్తినారు సినిమాతో సినిమాలకు పరిచయమైంది యషికా. సినిమాల కంటే ఎక్కువగా ఈమె వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

