టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం గని. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. బాలీవుడ్ నటి, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. గని చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండగా..స్టార్ హీరోయిన్ తమన్నా పాటలో మెరువనుందట.
తమన్నా మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి స్టెప్పులేయనుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తమన్నా ఇప్పటికే సరిలేరు నీకెవ్వెరు చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయగా అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో జగపతిబాబు, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, కన్నడ యాక్టర్ ఉపేంద్ర కీ రోల్స్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న గని ప్రాజెక్టును రెనాయ్సెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి జార్జ్ సీ విలియమ్స్ ఫొటోగ్రఫీ. జులై 30న సినిమా విడుదల చేయనున్నట్టు గతంలో నిర్ణయించగా..మరి ఆ డేట్ కే వస్తుందా..? మేకర్స్ కొత్త డేట్ ఏమైనా ప్రకటిస్తారా..? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
నాగశౌర్య మేనేజర్ గా వెంకట్..అతనెవరో తెలుసా..?
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్