ఇందిరాశక్తి చీరలకు నూలుసాయం అంతంతే!
సిరిసిల్ల కార్మిక క్షేత్రంలోని మ్యాక్స్ సొసైటీలోని ఓ ఆసామికి 8 సాంచాలు ఉన్నాయి. అతడితోపాటు రెండు, మూడు జోడీల సాంచాలు ఉన్న మరో 9 మందిని కలుపుకొని మొత్తం 110 సాంచాలతో మ్యాక్స్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నాడు.
- ఈ ఏడాది 6.7 కోట్ల మీటర్ల వస్ర్తోత్పత్తి
- సిరిసిల్ల 133 సంఘాలకు ఆర్డర్లు
- గడువు దాటి 20 రోజులవుతున్నాపూర్తికాని చీరల ఉత్పత్తి
- యార్న్ డిపో నుంచి సరఫరాకు 52 సొసైటీలకే అర్హత
- సకాలంలో బిల్లులు రాక అవస్థలు
- 1.7 కోట్ల మీటర్ల ఉత్పత్తి పెండింగ్
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల కార్మిక క్షేత్రంలోని మ్యాక్స్ సొసైటీలోని ఓ ఆసామికి 8 సాంచాలు ఉన్నాయి. అతడితోపాటు రెండు, మూడు జోడీల సాంచాలు ఉన్న మరో 9 మందిని కలుపుకొని మొత్తం 110 సాంచాలతో మ్యాక్స్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏడాది మొదటి విడతగా ఇందిరమ్మ చీరలకు సంబంధించి 2.70 లక్షల మీటర్ల వస్ర్తోత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం ఇవ్వగా, ఉత్పత్తి చేసి అందించాడు. రెండో విడతగా మరో 3 లక్షల మీటర్ల ఆర్డర్లను ఇవ్వగా సంబురపడ్డాడు. కానీ యార్న్ డిపో నుంచి నూలు 2.25 లక్షల మీటర్లకే కేటాయించడం, అది కూడా సకాలంలో అందించకపోవడంతో చీరల తయారీకి ఇబ్బందులు పడుతున్నాడు.
పెరిగిన రేట్లు..సమయానికి అందని నూలు
కేసీఆర్ సర్కార్ హయాంలో సక్సెస్‌ఫుల్‌గా అమలైన బతుకమ్మ చీరల స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళాశక్తి చీరల పథకాన్ని రెండేండ్ల కింద ప్రారంభించింది. 2026-2027 సంవత్సరానికిగాను రాష్ట్రంలోని కోటీ ఐదు లక్షల మంది మహిళలకు చీరలు అందించాలని నిర్ణయించి 6.33 కోట్ల మీటర్ల ఆర్డర్ల వస్ర్తోత్పత్తిని సిరిసిల్లతో పాటు కరీంనగర్, హనుమకొండ, వరంగల్ జిల్లాలోని సొసైటీలకు అందించింది. రాష్ట్రంలోనే సిరిసిల్లలో అత్యధికంగా 133 మ్యాక్స్ సొసైటీలు ఉండటంతో పెద్ద మొత్తంలో 6.7 కోట్ల మీటర్ల వస్ర్తోత్పత్తికి ఆర్డర్లను ఇచ్చింది. సిరిసిల్లకు సంబంధించి వస్ర్తోత్పత్తి కోసం అవసరమైన నూలు సాయం అందించడానికి ప్రభుత్వం రూ.50 కోట్లతో వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేసింది. సిరిసిల్లలోని 52 మ్యాక్స్ సొసైటీలను నూలు సాయానికి అర్హత ఉన్నవిగా గుర్తించి వారికే అందిస్తున్నారు. మిగిలిన 81 మ్యాక్స్ సొసైటీలు ప్రైవేట్‌గా నూలు, జరీ కొనుగోలు చేసి చీరలు ఉత్పత్తి చేస్తున్నారు.
గుర్తింపు పొందిన సంఘాల ఆసాములు నూలుకు అయ్యే మొత్తంలో పది శాతం డిపోలో చెల్లిస్తే 90 శాతం క్రెడిట్ మీద ఇస్తున్నారు. నూలు ఉంటే జరి, జరి ఉంటే నూలు అందకపోవడంతో పలు మరమగ్గాలు సైతం ఆగిపోయాయని, నూలు అందిన కొద్దీ వస్ర్తోత్పత్తి చేస్తుండగా, చీరల తయారీలో వెనుకబడ్డామని ఆసాములు చెబుతున్నారు. నూలు ధరలు పెరుగడంతో బయట కొనలేక, యార్న్ డిపోపై ఆధారపడి చీరల ఉత్పత్తిలో వెనుకబడ్డామని వాపోతున్నారు. సెప్టెంబర్‌లోనే చీరల ఉత్పత్తి పూర్తి చేయాల్సి ఉండగా, జౌళిశాఖ అధికారులు గడువును అక్టోబర్ నెలాఖరు వరకు పెంచారు.
సర్కార్ నూలు డిపో నుంచి నూలు సాయం సరిగ్గా అందకపోవడంతో నవంబర్ వచ్చినా పూర్తి చేయలేకపోయారు. ఆర్డర్లకు అనుగుణంగా నూలు కేటాయిస్తే ఈ పరిస్థితులు ఉండేవి కావని, మ్యాక్స్ సొసైటీ నిర్వాహకులు, ఆసాములు పేర్కొంటున్నారు. నూలు, ఉత్పత్తికి సంబంధించి బిల్లులు సకాలంలో ఇవ్వడంలేదని వాపోతున్నారు. అర్హత పొందిన సంఘాలకు ఇప్పటివరకు రూ.20.77కోట్ల విలువైన 952 మెట్రిక్ టన్నుల యార్న్ అందించినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

