కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూజాహెగ్డే ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సిన్ వేయించుకున్న స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. స్లీవ్‌లెస్ టాప్‌లో మాస్క్ పెట్టుకున్న పూజాహెగ్డే..”మీ నవ్వుతో భయాన్ని దాచిపెట్టండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడీ స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో దూసుకెళ్తుంది. పూజాహెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ఖాతాలో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బీస్ట్ చిత్రాలున్నాయి. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న బీస్ట్ షూటింగ్ దశలో ఉంది.
ఇవి కూడా చదవండి..
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?