‘నారప్ప’ కొడుకు శీనప్ప రోల్ చేసింది ఎవరో తెలుసా…?
నారప్ప..చాలా రోజుల తర్వాత వెంకటేశ్ లోని మరో యాంగిల్ ను ప్రేక్షకులను పరిచయం చేసిన సినిమా. నారప్పగా డీగ్లామరైజ్డ్ పాత్రలో వెంకటేశ్ జీవించేశాడని ఆడియెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నారప్ప..చాలా రోజుల తర్వాత వెంకటేశ్ లోని మరో యాంగిల్ ను ప్రేక్షకులను పరిచయం చేసిన సినిమా. నారప్పగా డీగ్లామరైజ్డ్ పాత్రలో వెంకటేశ్ జీవించేశాడని ఆడియెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన నారప్ప సినిమాకు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ చిత్రంలో వెంకటేశ్ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ శీనప్ప. అదేనండి నారప్ప చిన్న కొడుకు శీనప్ప. తెరపై చూస్తున్న ప్రేక్షకులకు శీనప్ప క్యారెక్టర్ ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తుంది. మరి శీనప్ప క్యారెక్టర్ లో నటించి అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న చైల్డ్ యాక్టర్ ఎవరు..ఎక్కడి నుంచి వచ్చాడనే విషయం తెలుసా..? చూడటానికి బొద్దుగా కనిపిస్తున్నఈ చైల్డ్ యాక్టర్ పేరు గీతా కృష్ణ. అతడి స్వస్థలం రాజమండ్రి.

గీతాకృష్ణ అన్నయ్య ఇండస్ట్రీలో కాస్టింగ్ మేనేజర్. గీతాకృష్ణ షార్ట్ ఫిలిం చేశాడు. ఆ తర్వాత అతడి అన్నయ్య సాయంతో సినిమాల ఆడిషన్స్ కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వస్తుండేవాడు. రామానాయుడు స్టూడియోస్ లో నారప్ప సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి హైదరాబాద్ కు వచ్చాడు. గీతా కృష్ణ ఆడిషన్స్ కు వచ్చే ముందే ఇద్దరిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు. కానీ ఫైనల్ గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గీతాకృష్ణనే ఎంపిక చేశారు.
ఆడిషన్స్ టైంలో ‘నేను ఈ క్యారెక్టర్ బాగా చేయగలను’ అనే డైలాగ్ ను డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్ లో అందరికి వినిపించేట్టు చెప్పవని నిర్మాత సురేశ్ బాబు గీతాకృష్ణకు చెప్పగా.. ఆయన చెప్పినట్టే చేశాడట గీతా కృష్ణ. అంతేకాదు గీతాకృష్ణను వెంకటేశ్ ఓ రూంలోకి తీసుకెళ్లి ఎమోషనల్ అవ్వుమని అడుగగా వెంటనే చేసి చూపించాడు. అలా శీనప్ప పాత్ర చేసే ఛాన్స్ తనకు వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గీతాకృష్ణ.
షార్ట్ ఫిలింలో చూశా: శ్రీకాంత్ అడ్డాల
గీతాకృష్ణ గురించి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాటల్లోనే..గీతాకృష్ణను షార్ట్ ఫిలింలో చూశా. శీనప్ప క్యారెక్టర్ కోసం చైల్డ్ ఆర్టిస్టును వెతికే టైంలో ఓ యూట్యూబ్ ఛానల్ లో అతన్ని చూశా. సురేశ్ బాబు, నేను ఓ సారి అతన్ని పిలిపించాం. అతడు రాజమండ్రి నుంచి వచ్చాడు. ఆడిషన్స్ కు పిలిపించి ఆ పాత్రకు ఇతడైతేనే కరెక్ట్ సెట్ అవుతాడని ఫైనల్ చేసినట్టు చెప్పాడు శ్రీకాంత్ అడ్డాల.
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

