త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. చాలా ఇండస్ట్రీలలో కూడా సీనియర్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు.. ఇంకా చేసుకుంటున్నారు కూడా. కోవిడ్ సమయంలో సినిమాలు లేకపోవడంతో తోడును వెతుక్కున్నారు.

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. చాలా ఇండస్ట్రీలలో కూడా సీనియర్ హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు.. ఇంకా చేసుకుంటున్నారు కూడా. కోవిడ్ సమయంలో సినిమాలు లేకపోవడంతో తోడును వెతుక్కున్నారు. ప్రణీత, కాజల్ సహా చాలా మంది హీరోయిన్లు ఓ ఇంటి వాళ్లైపోయారు. అయితే మరికొందరు సీనియర్లు మాత్రం ఇప్పటికీ పెళ్లి జోలికి పోవడం లేదు. వయసు 30 దాటి 40 వైపు పరుగులు పెడుతుంది. నయనతార, అనుష్క లాంటి వాళ్లు అయితే 35 కూడా క్రాస్ చేసి 40 వరకు వచ్చేసారు. అయినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఈ లిస్టులోనే త్రిష కూడా ఉంది. ఈమె వయసు కూడా 37 ఏళ్ళు. ఇప్పటికీ పెళ్లి గిల్లీ లేదంటుంది.
నిజానికి ఐదేళ్ల కిందే ఈమె ప్రేమలో పడి.. బిజినెస్ మ్యాన్ వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం చివర్లో పెటాకులు అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరస సినిమాలు చేస్తుంది త్రిష. ఇప్పటికీ ఈమె అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ త్రిషకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి గురించి కూడా ఓపెన్ అయిపోయింది. తనకు ఎలాంటి వాడు కావాలో క్లారిటీ ఇచ్చింది త్రిష. సూటిగా సుత్తి లేకుండా తనకు కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఓపెన్ అయిపోయింది. తనకు పెద్దగా అందగాడేమీ అవసరం లేదని చెప్పుకొచ్చింది త్రిష.
కేవలం తనను బాగా చూసుకునే వాడైతే చాలు అంటుంది. హీరోలా ఉండాలనే రిక్వైర్మెంట్స్ లేవని.. మనిషి కాదు.. మనసు బాగుంటే చాలు అంటూ తెలిపింది త్రిష. కాబోయే వాడు నలుపైనా పర్లేదని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఇంట్లో చూపించిన వాడిని మాత్రం చస్తే పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చింది. ప్రేమ వివాహమే చేసుకుంటానని బల్ల గుద్ధి మరీ చెప్తుంది త్రిష. ఈమె మాట తీరు చూస్తుంటే ఇప్పటికే ఎవరితోనో త్రిష ప్రేమలో ఉందంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా దీనిపై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె ఓ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న త్రిష.. ఇప్పుడు మళ్లీ బిజినెస్ మ్యాన్ తోనే పెళ్లికి సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతుండటం విశేషం.
ఇవి కూడా చదవండి..
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
నాగశౌర్య మేనేజర్ గా వెంకట్..అతనెవరో తెలుసా..?
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

