శనివారం 04 జూలై 2020
Cinema - May 25, 2020 , 12:20:31

త‌న‌లో దాగి ఉన్న టాలెంట్‌ని ప‌రిచ‌యం చేసిన రాశీ ఖ‌న్నా

త‌న‌లో దాగి ఉన్న టాలెంట్‌ని ప‌రిచ‌యం చేసిన రాశీ ఖ‌న్నా

గ్లామర్ బ్యూటీ రాశీ ఖ‌న్నా లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న‌లో దాగి ఉన్న ప్ర‌తిభ‌ని బ‌య‌ట‌కి తీస్తుంది. చిన్న‌ప్పుడు గిటార్ నేర్చుకున్న ఈ అమ్మ‌డు తాజాగా త‌న ఫేవ‌రేట్ సాంగ్‌ని గిటార్ ద్వారా ప్లే చేసింది. ఇది మీ అంద‌రికి నచ్చుతుంద‌ని కామెంట్ చేసింది.

 రాశీ ఖ‌న్నా గ‌త ఏడాది ప్ర‌తి రోజూ పండగే, వెంకీ మామ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ ఏడాది వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌లో విజ‌య్ స‌ర‌స‌న న‌టించింది. ఈ చిత్రంలో రాశీ రొమాన్స్ శృతి మించ‌డంతో నెటిజ‌న్స్ ఆమెపై సీరియ‌స్ అయ్యారు. దీంతో ఇంకోసారి అలాంటి పాత్ర‌లు చేయ‌కూడద‌ని డిసైడ్ అయింది ఈ అందాల రాశి. ప్ర‌స్తుతం త‌న చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. 


logo