ఒక్క హిట్.. ఒకే ఒక హిట్ తో పూరి జగన్నాథ్ మళ్ళీ పూర్తిగా ఫాంలోకి వచ్చేసాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయన జోరు పెంచాడు. ఆయనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా బాగా పెరిగాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పూరి జగన్నాథ్ చేస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ఇది. దీనికోసం బడ్జెట్ కూడా భారీగానే పెడుతున్నాడు ఈ దర్శకుడు. హిందీలో దర్శక నిర్మాత కరణ్ జోహార్ లైగర్ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.
ఇదంతా ఇలా ఉంటే విజయ్ తర్వాత పూరి ఎవరితో సినిమా చేస్తాడనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సమాధానంగా చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూరి తర్వాత సినిమా బాలకృష్ణతో ఉండబోతుంది. బాలయ్య కోసం అదిరిపోయే స్టోరీ సిద్ధం చేశాడు పూరి. నిజానికి గతేడాది లాక్డౌన్ సమయంలోనే బాలయ్య కోసం బంపర్ స్టోరీ రాశానని చెప్పాడు పూరి జగన్నాథ్. మరోవైపు బాలయ్య కూడా పూరితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
నాలుగేళ్ల కింద ఈ కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ టైటిల్ కు తగ్గట్టు పైసా వసూలు చేయలేదు. కానీ బాలయ్యని చాలా కొత్తగా చూపించాడు పూరి జగన్నాథ్. ఆయన వర్కింగ్ స్టైల్ నచ్చడంతో మరో అవకాశం కూడా ఇచ్చాడు బాలకృష్ణ. ఈ సారి కేవలం తెలుగు ఇండస్ట్రీ వరకు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాను టార్గెట్ చేస్తున్నారు పూరి, బాలయ్య. పాన్ ఇండియన్ సబ్జెక్టుతో బాలయ్యను హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి పూరి ప్రణాళికలు రచిస్తున్నాడు.
బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండతో పాటు గోపీచంద్ మలినేనితో ఒక సినిమా కమిట్ అయ్యాడు. మరోవైపు అనిల్ రావిపూడి కూడా తన తర్వాత సినిమా బాలయ్య తోనే ఉంటుంది అని కన్ఫర్మ్ చేశాడు. ఇవి పూర్తి అయిన తర్వాత పూరి జగన్నాథ్, బాలకృష్ణ సినిమా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి వీళ్ళు చేయబోయే ఆ పాన్ ఇండియన్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!