అమరావతి : ప్రజా రాజధాని అమరావతి ( Amaravati ) ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, అమరావతి ఇక అజేయం ( Invincible ) ..అజరామరమని ( Immortal) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandrababu) అన్నారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని అన్నారు.
రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతామని, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. లోక్ సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.