Israel | ఇండియాకు లైట్ మెషీన్ గన్స్ అందించిన ఇజ్రాయెల్.. త్వరలో మరిన్ని గన్స్ డెలివరీ
Israel : ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన లైట్ మెషీన్ గన్స్‌ను ఇండియాకు అందించింది ఇజ్రాయెల్.
Israel : ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధాలు చాలా ప్రత్యేకమైనవి. రక్షణ సహా అనేక అంశాల్లో ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన లైట్ మెషీన్ గన్స్‌ను ఇండియాకు అందించింది ఇజ్రాయెల్. NEGEV 7.62×51 అని పిలిచే 2,000 లైట్ మెషీన్ గన్స్ గతవారమే ఇండియాకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా మరో 4,000 మెషీన్ గన్స్ కూడా రానున్నాయి.
మొత్తం 41,000 మెషీన్ గన్స్ ఇండియాకు అందించేందుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ గన్స్ తయారీ కొనసాగుతోంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ గన్స్ తయారయ్యాయి. అంటే, ఇండియాకు చెందిన అదానీ గ్రూప్ సంస్థతో కలిసి, ఇజ్రాయెల్‌కు చెందిన ఐడబ్ల్యూఐ (ఇజ్రాయెల్ వెపన్స్ ఇండస్ట్రీస్) అనే ప్రభుత్వ ఆయుధ తయారీ సంస్థ కలిసి వీటిని తయారు చేశాయి. ఈ రెండు సంస్థలు కలిసి పీఎల్ఆర్ సిస్టమ్స్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి, వీటిని తయారు చేస్తున్నారు. ఇక, ఇండియాలో ఒక ప్రైవేటు సంస్థ (అదానీ గ్రూప్) ఆయుధాలు తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇవి 7.62 ఎంఎం లైట్ మెషీన్ గన్స్. తక్కువ బరువుతో, కచ్చితత్వంతో ఈ గన్స్ పని చేస్తాయి. వీటిలో సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ అనే రెండు రకాలు ఉంటాయి. ఇందులో 7.62 ఎంఎం బుల్లెట్స్ వాడొచ్చు.
ఎలాంటి వాతావరణంలోనైనా, మరింత వేగంగా, బలంగా పని చేస్తాయి. ఈ గన్స్‌ను హెలికాప్టర్లు, వాహనాలు, నేవీ ప్రదేశాలు సహా ఎక్కడినుంచైనా ప్రయోగించవచ్చు. తక్కువ వెలుతురులో కూడా టార్గెట్‌ను చేధించవచ్చు. ఆయుధాల విషయంలో నాటో స్టాండర్డ్స్‌ను ఇవి అందుకుంటాయి. ఇవి కంప్యూటరైజ్డ్ వెపన్స్ కూడా. ఇజ్రాయెల్ నుంచి ఇండియా మరిన్ని ఆయుధాలను దిగుమతి చేసుకోనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

