Power star puneeth rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్రసీమతో పాటు అన్ని ఇండస్ట్రీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ మరణ వార్త తెలిసి దక్షిణాది చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. పునీత్ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగి తేలుతున్నారు. తమ అభిమాన హీరోను చివరిసారి చూసేందుకు అభిమానులు మొదట విక్రమ్ ఆస్పత్రికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పునీత్ భౌతికకాయాన్ని విక్రమ్ ఆస్పత్రి నుంచి సదాశివనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ క్రమంలో తమ అభిమాన హీరో కోసం అంబులెన్స్ వెనుక వేలాదిమంది అభిమానులు ఫాలో అయ్యారు. అభిమానుల ఆందోళన దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అలాగే అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసి చివరిచూపు కోసం అభిమానులు స్టేడియం వద్దకు తరలివస్తున్నారు.
ఇక పునీత్ రాజ్‌కుమార్ మరణం పట్ల కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను తన తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సమాధి వద్దే నిర్వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
puneeth rajkumar | వయసు 46 ఏండ్లే.. కానీ 45 ఏళ్ల సినీ కెరీర్ ఆయన సొంతం
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్