Salaar | ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు నిర్మాతలకు ఆనందమే కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం తెలియని టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ఈయన సినిమాలు భారీ బిజినెస్ చేస్తున్నాయి.. కానీ అంత వెనక్కి రాబట్టలేక ప్లాపులుగా మిగులుతున్నాయి. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. ఒక్కో సినిమా కనీసం 300 నుంచి 400 కోట్ల బిజినెస్ జరిగితే.. అందులో వచ్చింది సగమే. మొన్న ఆదిపురుష్ సినిమా 400 కోట్లకు పైగా వసూలు చేసిన కూడా చాలా చోట్ల నష్టాలు తప్పలేదు. ఇక ఇప్పుడు సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. దీనిపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ప్రశాంత్ నీల్ కూడా ఉండటంతో సినిమా రేట్లు ఆకాశాన్ని తాకేస్తున్నాయి.
బిజినెస్ పరంగా చూసుకుంటే ప్రభాస్ కెరీర్ లోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది సలార్. కేవలం ఏపీ తెలంగాణలోనే ఈ సినిమాకు 200 కోట్ల బిజినెస్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. తాజాగా విడుదలైన టీజర్ లో ప్రభాస్ మొహం కనిపించకపోయినా కూడా యూట్యూబ్ లో దానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమాపై ఉన్న అంచనాలు ఏంటో అర్థం అయిపోతున్నాయి. కాకపోతే టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ వీరాభిమానులు కూడా కాస్త నిరుత్సాహపడుతున్నారు. అదేంటి మా హీరోను ప్రశాంత్ ఇలా చూపించాడు.. కనీసం మొహమైనా చూపించి ఉంటే బాగుండేది కదా.. విలన్ ఫేస్ చూపించి హీరోను దాచేయడం ఏంటి? పైగా టీజర్ అంత టిను ఆనంద్ ఉన్నాడు.. కాసేపైనా ప్రభాస్ ఉండుంటే బాగుండేది అంటూ రకరకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న విడుదల కానుంది. దీనికి సీజ్ ఫైర్ అనే టాగ్ లైన్ ఇచ్చాడు. అంటే యుద్ధాన్ని ఆపడం అన్నమాట.
మొదటి భాగం అంతా ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య జరుగుతుంది. రెండో భాగం మరో ప్రభాస్, జగపతిబాబు మధ్య జరుగుతుంది. ఏదేమైనా సలార్ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్.. ఆ సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే నిర్మాతలకు హ్యాపీగానే ఉంది. కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. క్రేజ్ ఉంది కాబట్టి నిర్మాతలు సినిమాను తక్కువకు ఇచ్చేది లేదు అంటున్నారు. ముందు సినిమాల ఫ్లాప్స్ దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏదైనా తక్కువకి ఇస్తారేమో అనుకుంటే అలాంటి ఆశలు ఏవి ఫలించేలా కనిపించడం లేదు. మరి చూడాలిక ఏం జరగబోతుందో..!
Rangabali Review | రంగబలి ఎలా ఉంది.. ప్రీమియర్ షో టాక్..
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాల రీరిలీజ్లు ఆపేస్తేనే బెటర్ ఏమో!
Salaar Teaser | సలార్ టీజర్లో హైలెట్ అయిన ఈ యాక్టర్ ఎవరో గుర్తున్నాడా?
Krithi Shetty | బేబమ్మ మళ్లీ పుంజుకుంటుందా.. మూడు ఇండస్ట్రీల్లో మూడు భారీ సినిమాలు..!