Thalapathy Vijay | విజయ్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా దళపతి..?
Thalapathy Vijay | విజయ్ సినిమా అంటే ఒకప్పుడు కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయనకు తెలుగులో కూడా మార్కెట్ చాలా వచ్చింది.
Thalapathy Vijay | విజయ్ సినిమా అంటే ఒకప్పుడు కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయనకు తెలుగులో కూడా మార్కెట్ చాలా వచ్చింది. ఇప్పుడు లియో సినిమాకు ఏకంగా 22 కోట్ల మార్కెట్ జరుగుతుంది అంటే తెలుగులో ఆయన రేంజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత చేసే ప్రాజెక్ట్స్ పై కూడా ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ లియో సినిమాతో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. కస్టడీ అంత పెద్ద డిజాస్టర్ అయినా కూడా ఆయన కథ నమ్మి ముందడుగు వేస్తున్నాడు విజయ్.
లియో తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. దసరా సెలవులు ఉన్న టార్గెట్ చేస్తూ విజయ్ సినిమాను తీసుకొస్తున్నాడు. అన్ని ఇండస్ట్రీలో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కరెక్ట్ గా వర్కౌట్ అయితే 1000 కోట్లు వసూలు చేసే సినిమా అవుతుందని విజయ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే వెంకట్ ప్రభు సినిమా తర్వాత విజయ్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి మూడేళ్లు గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. తమిళనాడులో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు విజయ్. గత ఎన్నికల సందర్భంగా ఏ పార్టీకి ఓటేయాలని విషయంపై విజయ్ తన అభిమానులకు సూచించాడు.
ఆయన చెప్పిన పార్టీకి ఓటు వేయడం.. అది అధికారంలోకి రావడం కూడా జరిగాయి. తమిళనాడులో విజయ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ పార్టీలు కూడా ఆయన మద్దతు కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ అతడు మాత్రమే ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కేవలం పరోక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే రేంజ్ లో తన అభిమానులను ప్రభావితం చేస్తూ ఉంటాడు. అలాంటి విజయ్ వచ్చే ఎన్నికల్లో నేరుగా పోటీ చేయాలని భావిస్తున్నాడు. అందుకే సినిమాల నుంచి కొన్నేళ్లు గ్యాప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు ఈయన. దీనికోసమే ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు విజయ్.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తమిళనాట ఇంతకంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదు. లియో ఇదే ఏడాది రానుంది. వెంకట్ ప్రభు సినిమా 2024 ప్రథమార్ధంలో విడుదల చేయాలని చూస్తున్నాడు విజయ్. దానికి తగ్గట్టే డేట్స్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాడు. మళ్లీ తర్వాత సినిమా 2027 లోనే చేయాలని చూస్తున్నాడు విజయ్. ఒకవేళ ఇదే నిజమైతే తన కెరీర్లో తీసుకునే అతిపెద్ద బ్రేక్ ఇదే అవుతుంది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇది సంచలనం కాబోతుంది.
Read More :
Singer Coco Lee | ఆత్మహత్యకు యత్నించి కోమాలోకి..! హాంకాంగ్ సింగర్ కోకో లీ కన్నుమూత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

