Singer Coco Lee | ఆత్మహత్యకు యత్నించి కోమాలోకి..! హాంకాంగ్ సింగర్ కోకో లీ కన్నుమూత..!
Singer Coco Lee | హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్ గాయని కోకో లీ (48) కన్నుమూశారు. డిప్రెషన్‌తో బాధపడుతుందని, ఈ నెల 4న ఆమె ఆత్మహత్యకు యత్నించారని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆమె సిస్టర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
Singer Coco Lee | హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ సింగర్ గాయని కోకో లీ (48) కన్నుమూశారు. డిప్రెషన్‌తో బాధపడుతుందని, ఈ నెల 4న ఆమె ఆత్మహత్యకు యత్నించారని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆ తర్వాత ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆమె సిస్టర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘హిడెన్ డ్రాగన్’లోని ‘ఎ లవ్ బిఫోర్ టైమ్’ సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌కు నామిట్కావడంతో పాటు అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్ అమెరికన్‌గా నిలిచారు. కోకో లీ గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతుందని.. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించిందని ఆమె సిస్టర్స్ కరోల్, నాన్సీ పేర్కొన్నారు. ఇటీవల పరిస్థితి మరింత దిగజారిందని, ఈ క్రమంలోనే ఈ నెల 2న ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందని చెప్పారు.
ఆ తర్వాత ఆసుపత్రికి తరలించామని, చనిపోయేంత వరకు కోకో లీ కోమాలోనే ఉందని వివరించారు. కోకోలీ హాంకాంగ్‌లో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ మిడిల్ స్కూల్లో చదువుకున్నారు. ఆసియాలో పాప్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 30 ఏళ్ల కెరీర్లో కాంటోనీస్, ఆంగ్లంలో ఆల్బమ్‌లను సైతం విడుదల చేశారు. 1996లో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం చేసుకున్న తొలి చైనీస్ గాయనిగా నిలిచారు. ఆమె తర్వాతి ఆల్బమ్ కోకో లీ ఆసియాలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌గా నిలిచింది. 1997లో ఆమె మాండరిన్ ఆల్బమ్ సిన్సియర్‌తో పాటు కాంటోనీస్ ఆల్బమ్‌ను విడుదల చేసింది. 1998లో మాండరిన్ ఆల్బమ్ డి డా డి విడుదలవగా.. మూడు నెలల్లో మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. ఆమె డిస్నీ మూలాన్ మాండరిన్ వెర్షన్లో హీరోయిన్ ఫా ములాన్‌కు గాత్రదానం చేసింది. రిఫ్లెక్షన్ అనే థీమ్ సాంగ్.. మాండరిన్ వెర్షన్‌ను పాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

