Salaar Teaser | గూస్బంప్స్ తెప్పిస్తోన్న ప్రభాస్ సలార్ టీజర్.. కేజీఎఫ్ రికార్డ్స్ బద్దలైపోయినట్టే..!
Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ (Salaar). మూవీ లవర్స్, ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సలార్ టీజర్ రానే వచ్చిన విషయం తెలిసిందే.
Salaar | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ (Salaar). కేజీఎఫ్ ప్రాంచైజీని తెరకెక్కించిన హోంబలేఫిలిమ్స్-డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వస్తోంది. మూవీ లవర్స్, ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సలార్ టీజర్ రానే వచ్చిన విషయం తెలిసిందే. Salaar part-1 Ceasefire టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. సలార్ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 20 మిలియన్లకుపైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ విషయాన్ని సలార్ నటి శ్రియా రెడ్డి షేర్ చేసింది.
మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ మరోసారి కేజీఎఫ్ ప్రాంఛైజీని మించిన హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ఆడియెన్స్‌ను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయమని రషెస్ చెబుతున్నాయి. బాహుబలి ప్రాంఛైజీ తర్వాత ప్రభాస్ కాంపౌండ్ నుంచి వస్తున్న ఆ రేంజ్ సినిమా కావడం, మరోవైపు కేజీఎఫ్ విజువల్స్‌ను బీట్ చేసేలా టీజర్ సాగుతుండటంతో… సలార్ ఈ రెండు ప్రాజెక్ట్‌ల రికార్డుల బద్దలు కొట్టడం ఖాయమని నెటిజన్లు అంచనాలు వేస్తున్నారు. కేజీఎఫ్, బాహుబలి కలిస్తే సలార్ అంటూ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ పర్ఫెక్ట్గా అంచనా వేసినట్టు తాజా టీజర్‌తో అర్థమవుతుంది.

Salaar2
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీ రోల్ పోషిస్తున్నాడు. సలార్ పార్ట్-1ను 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మరోసారి టీజర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై విజయ్ కిరగందూర్ సలార్ ను తెరకెక్కిస్తున్నారు. మరి సలార్ పార్ట్-2 ఎప్పుడు వస్తుందనేది తెలియాలంటే పార్ట్ 1 రిలీజ్ వరకు ఆగాల్సిందే.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఇప్పటికే వచ్చిన కేజీఎఫ్ ప్రాంఛైజీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. మరోవైపు ప్రభాస్ నటించిన ప్రాంఛైజీ బాహుబలి గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ ఇద్దరు పాన్ ఇండియా సెలబ్రిటీల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. సలార్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ K, మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.
సలార్ టీజర్..
And counting…
20 Million+ Views & Trending at #1 🔥#SalaarTeaser sparks a wildfire of excitement!
▶️ https://t.co/36T2bzeFWq#SalaarCeaseFire #Salaar #Prabhas @PrabhasRaju #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/22i0reyd6I
— Sriya Reddy (@sriyareddy) July 6, 2023
No Confusion 💥💥💥
25 Million Views & Trending #1 On @YouTube ❤️🔥#SalaarTeaser #SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @SalaarTheSagapic.twitter.com/FJkJI4lDeb
— Suresh PRO (@SureshPRO_) July 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

