Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాల రీరిలీజ్‌లు ఆపేస్తేనే బెటర్ ఏమో!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. దీని మీద ఎవరికి ఏ కంప్లయింట్స్ లేవు. దర్శక నిర్మాతలు ఒక అండర్‌స్టాండింగ్‌తో పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. దీని మీద ఎవరికి ఏ కంప్లయింట్స్ లేవు. దర్శక నిర్మాతలు ఒక అండర్‌స్టాండింగ్‌తో పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ అసలు సమస్య ఆయన రీ రిలీజ్ సినిమాల విషయంలోనే వస్తుంది. పవన్ కళ్యాణ్‌కు క్రేజ్ ఉంది కదా అని.. ఆయన పాత సినిమాలను మొత్తం రీ రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఏదైనా సరే మొదట ఉన్న ఆసక్తి ఆ తర్వాత ఉండదు. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాను ఇలా రిలీజ్ చేస్తూ పోతూ ఉంటే కొన్ని సంవత్సరాలకు ఒక్క సినిమా కూడా ఆయన కెరీర్లో మళ్లీ రిలీజ్ చేసుకోవడానికి మిగలదు.
జల్సాతో మొదలైన రీరిలీజ్ సందడి ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ, బద్రి అంటూ అలా ముందుకు వెళుతూ ఉంది. జల్సా సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఖుషి సినిమాకు రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. వీటికి బాగా వచ్చాయి కదా అని బద్రి, తమ్ముడు సినిమాలను తీసుకొస్తే వాటిని కనీసం పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఇక మొన్నటికి మొన్న తొలిప్రేమ సినిమాను కూడా మళ్లీ రిలీజ్ చేశారు. ఇది విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా థియేటర్స్ లో మరోసారి తీసుకొచ్చారు. కానీ కలెక్షన్స్ విషయం చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కు అవమానం తప్పదు.
ఎందుకంటే రీ రిలీజ్లో జల్సా సినిమా మొదటి రోజు దాదాపు రూ.2 కోట్లు తీసుకొస్తే.. ఖుషి రూ.4 కోట్లు తీసుకొచ్చింది. కానీ మొన్న తొలిప్రేమ సినిమాకు కోటి రూపాయలు కూడా రాలేదు. మూడు రోజుల్లో కలిపి కేవలం కోటి 16 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఖుషి సినిమాకు దాదాపు రూ.7 కోట్ల గ్రాస్ వచ్చింది.. అంటే పవన్ కళ్యాణ్ పాత సినిమాలపై అభిమానులకు ఆసక్తి తగ్గిపోతుందనే విషయం అర్థమైపోతుంది. ఇలాంటి సమయంలో కూడా ఆయన పాత సినిమాలు మళ్లీ రిలీజ్ చేస్తే.. అనవసరంగా బాక్సాఫీస్ దగ్గర ఆ నెంబర్స్ చూసి అవమానపడటం తప్ప ఇంకోటి ఉండదు. అందుకే రీ రిలీజ్ సినిమాలు ఇక్కడితో ఆపేస్తే బెటర్ అంటున్నారు విశ్లేషకులు. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మళ్లీ రిలీజ్ చేసుకోవడానికి గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది తప్పిస్తే చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ కూడా ఇప్పుడేమీ మిగల్లేదిక.. పైగా అవి వచ్చి 10 సంవత్సరాలు మాత్రమే అయ్యాయి. వాటిని మళ్లీ రిలీజ్ చేస్తే చూడ్డానికి అభిమానులు కూడా ఆసక్తి చూపించరు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలకు రీ రిలీజ్ ఆపేస్తే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు.
Read More :
Salaar Teaser | సలార్ టీజర్లో హైలెట్ అయిన ఈ యాక్టర్ ఎవరో గుర్తున్నాడా?
Krithi Shetty | బేబమ్మ మళ్లీ పుంజుకుంటుందా.. మూడు ఇండస్ట్రీల్లో మూడు భారీ సినిమాలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

