Krithi Shetty | కొన్నిసార్లు కెరీర్ రాకెట్లా మొదలవుతుంది. కానీ ఆ తర్వాత తుస్సుమంటూ కిందికి వెళ్లిపోతుంది. ఆ లిస్టులో కృతి శెట్టి ఉంటుంది. ఎందుకంటే మొదటి మూడు సినిమాలతో భారీ విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయింది. ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. కానీ అక్కడి నుంచి ఆమె కెరీర్ మొత్తం రివర్స్ అవ్వడం మొదలైంది.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, మాచర్ల నియోజకవర్గం, మొన్న వచ్చిన కస్టడీ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి.
దాంతో కృతి శెట్టి గురించి ఆలోచించడం కానీ.. అవకాశం ఇచ్చే విషయంలో కానీ దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈమె కెరీర్ మళ్లీ మెల్లగా పుంజుకుంటుంది. ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో భారీ సినిమా ఈమె చేతిలో ఉందిప్పుడు. అవి కానీ హిట్ అయ్యాయి అంటే కృతి శెట్టి మళ్లీ ఫామ్‌లోకి రావడం పెద్ద విషయం కాదు. తెలుగులో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కృతి రెండో హీరోయిన్గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. చలో తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.
మరోవైపు మలయాళంలో టివోనో థామస్ హీరోగా నటిస్తున్న అజయ రాండం మోషణం సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఇది పాన్ ఇండియా సినిమా. పైగా మలయాళంలో అత్యధిక బడ్జెట్‌తో వస్తున్న సినిమా ఇదే. తాజాగా తమిళంలో జయం రవి హీరోగా నటిస్తున్న జీని సినిమాలోనూ కృతి శెట్టి హీరోయిన్గా ఎంపికైంది. ఈ మూడు వాటి వాటి ఇండస్ట్రీలలో బాగా పెద్ద సినిమాలే. ఇవి గాని కరెక్ట్‌గా హిట్ అయ్యాయి అంటే కృతి శెట్టి కెరీర్ గాడిన పడటం పెద్ద విషయం కాదు. చూడాలి ఏం జరగబోతుందో..!
Krithi Shetty | ఓర చూపులతో మదిని గిల్లుతున్న కృతి శెట్టి..”