రూరల్ యాక్షన్ డ్రామా ‘సెయాన్’
కథల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తారు తమిళ హీరో శివకార్తికేయన్. సోమవారం ఆయన కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ‘సెయాన్' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తారు.
కథల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తారు తమిళ హీరో శివకార్తికేయన్. సోమవారం ఆయన కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ‘సెయాన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మించనున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘అమరన్’ తర్వాత శివకార్తీకేయన్ మరోమారు కమల్‌హాసన్ నిర్మాణంలో సినిమా చేస్తుండటం విశేషం.
సోమవారం సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్ చేతిలో పొడవాటి కత్తిని పట్టుకొని రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నెమళ్లు కనిపిస్తున్నాయి. గాడ్ ఆఫ్ వార్‌గా అభివర్ణించే కార్తీకేయుడిని తమిళంలో ‘సెయాన్’ అనే పేరుతో కూడా పిలుస్తారు. గ్రామీణ నేపథ్యంలో ఆధ్యాత్మిక, యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రమిదని, శివకార్తికేయన్ పూర్తి మాస్ అవతారంలో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

