Salaar Teaser | సలార్ టీజర్లో హైలెట్ అయిన ఈ యాక్టర్ ఎవరో గుర్తున్నాడా?
Salaar Teaser | కేజీఎఫ్ సినిమాలో హీరోకు పెద్దగా పంచ్ డైలాగులేవీ లేవు! పుంఖానుపుంఖాను డైలాగులు కూడా ఉండవు.. కానీ ఆ పాత్ర హైలెట్ కావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్. కథానాయకుడికి ఎలివేషన్ ఇచ్చేందుకే సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్.
Salaar Teaser | కేజీఎఫ్ సినిమాలో హీరోకు పెద్దగా పంచ్ డైలాగులేవీ లేవు! పుంఖానుపుంఖాను డైలాగులు కూడా ఉండవు.. కానీ ఆ పాత్ర హైలెట్ కావడానికి ప్రధాన కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్. కథానాయకుడికి ఎలివేషన్ ఇచ్చేందుకే సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. రాఖీ భాయ్ పాత్రకు మొదటి పార్ట్‌లో అనంతనాగ్, రెండో పార్ట్‌లో ప్రకాశ్ రాజ్ ఇచ్చిన ఎలివేషనే సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పుడు రీసెంట్గా రిలీజైన ప్రభాస్ సలార్ సినిమా టీజర్లోనూ అలాంటి పాత్ర ఒకటి కనిపించింది. సింపుల్ ఇంగ్లీష్.. నో కన్ఫ్యూజన్ అంటూ డైలాగ్ మొదలుపెట్టిన ఆ క్యారెక్టర్.. సలార్‌లో కథానాయకుడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో చెప్పిన విధానం అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ టీజర్ చూసిన తర్వాత సలార్‌లో ప్రభాస్ క్యారెక్టర్‌కు హైప్ ఇచ్చేది ఆ క్యారెక్టరేనని ఫిక్సయిపోయారు. దీంతో ఆ రోల్ చేసిన యాక్టర్ ఎవరు? అతన్ని ఎక్కడో చూసినట్టు ఉందని ఆన్లైన్లో వెతికేస్తున్నారు. అతని గురించి వెతికేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సలార్‌లో కీ రోల్లో కనిపించిన ఆ నటుడు ఎవరో కాదు.. టీనూ ఆనంద్. బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ఇతను మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అప్పట్లో బాలకృష్ణ హీరోగా సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్సన్ మూవీ ఆదిత్య 369తో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. టైమ్ మిషన్‌ను కనిపెట్టే సైంటిస్ట్ పాత్రలో మెప్పించాడు. ఆ తర్వాత కైకాల సత్యనారాయణ, అలీ, రోజా ప్రధాన పాత్రలో 1995లో వచ్చిన ఘటోత్కచుడు సినిమాలోనూ రోబోను కనిపెట్టే శాస్త్రవేత్తగా నవ్వించాడు. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ సినిమా అంజిలో వీరేంద్ర భాటియాగా నటించారు. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు ఏమీ చేయలేదు. టాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలు వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చు. కానీ ఆయా పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చాలారోజులుగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈయన.. కొద్దిరోజులుగా పాన్ ఇండియా సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు. ప్రభాస్ సాహో, సీతారామం సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. ఇప్పుడు సలార్‌తో మళ్లీ మన ముందుకొస్తున్నాడు.

Read More :
Krithi Shetty | బేబమ్మ మళ్లీ పుంజుకుంటుందా.. మూడు ఇండస్ట్రీల్లో మూడు భారీ సినిమాలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

