Rangabali Review | రంగబలి ఎలా ఉంది.. ప్రీమియర్ షో టాక్..
Rangabali Review | నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి సినిమా ప్రీమియర్ షో కూడా వేశారు దర్శక నిర్మాతలు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను పవన్ బాసం శెట్టి డైరెక్ట్ చేశాడు.
Rangabali Review | ఈమధ్య చిన్న సినిమాలు అయినా కూడా కంటెంట్ మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా వేసిన సామజవరగమన ఈరోజు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి విడుదలకు మూడు రోజుల ముందు నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విజయానికి దోహద పడింది. దాంతో ఇప్పుడు నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి సినిమా ప్రీమియర్ షో కూడా వేశారు దర్శక నిర్మాతలు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను పవన్ బాసం శెట్టి డైరెక్ట్ చేశాడు.
సోషల్ మీడియాలో భిన్నమైన ప్రమోషన్స్ చేసుకుంటూ సినిమాపై ఆసక్తి బాగానే పెంచేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ప్రీమియర్ షో రెస్పాన్స్ బయటకు వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ గా పేలింది అంటున్నారు ప్రేక్షకులు. ఒక్క నిమిషం కూడా సీట్లలో కూర్చోకుండా ఘొల్లుమని నవ్వుకునేలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా కమెడియన్ సత్య ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వించి నవ్వించి చంపేశాడు అంటున్నారు ఆడియన్స్. అసలే మాత్రం బోర్ కొట్టకుండా ఇంటర్వెల్ వరకు తీసుకొచ్చిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ పక్కన పెట్టి సీరియస్ గా ట్రై చేయాలని చూశాడు. అయితే అసలు కథ మొదలైన తర్వాత వినోదం పక్కకు వెళ్లిపోవడంతో కాస్త లాగ్ అయిందని.. అప్పటి వరకు ఒక టెంపోలో వెళ్లిన ఒక కథ సెకండాఫ్ పూర్తిగా సీరియస్ టర్న్ తీసుకుందని.. దాంతో కొద్దిగా బోర్ ఫీల్ అవుతారనే టాక్ బయటకు వచ్చింది.
పైగా సెకండాఫ్ లో తమిళ హీరో శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటించాడు. ఇప్పటివరకు ఆయన పేరు కానీ పాత్ర గురించి కానీ బయట ఎక్కడ ప్రమోషన్స్ లో చెప్పలేదు మేకర్స్. మళ్ళీ క్లైమాక్స్ లో 15 నిమిషాల పాటు కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్తున్నారు ప్రేక్షకులు. ఓవరాల్ గా సినిమా మాత్రం టైం పాస్ ఎంటర్టైనర్ అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే పైసా వసూల్ అని.. సెకండ్ హాఫ్ మాత్రం డల్ గా సాగింది అంటున్నారు ప్రేక్షకులు.
Read More :
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాల రీరిలీజ్లు ఆపేస్తేనే బెటర్ ఏమో!
Salaar Teaser | సలార్ టీజర్లో హైలెట్ అయిన ఈ యాక్టర్ ఎవరో గుర్తున్నాడా?
Krithi Shetty | బేబమ్మ మళ్లీ పుంజుకుంటుందా.. మూడు ఇండస్ట్రీల్లో మూడు భారీ సినిమాలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

