టాలీవుడ్ (Tollywood)లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ కమ్ డైరెక్టర్లలో టాప్ ప్లేస్ లో ఉంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ఈ మాటల మాంత్రికుడి సతీమణి సౌజన్య శ్రీనివాస్ (Sowjanya Srinivas)మంచి క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసిందే. సౌజన్య క్లాసిక్ డ్యాన్స్ ప్లే (నాటక నృత్య ప్రదర్శన) ఇవ్వనున్నారు. మీనాక్షి కల్యాణం పేరుతో డిసెంబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
పసుమర్తి రామలింగ శాస్త్రి నాటకానికి దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిన ప్రొడక్షన్స్, ఫార్చూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో క్లాసికల్ డ్యాన్సర్ అవతార్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నారు సౌజన్య. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ ( Pawan Kalyan)ముఖ్యఅతిథిగా రాబోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతోపాటు తనికెళ్లభరణి పలువురు ప్రముఖులు హాజరకానున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో