పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam). యూనివర్సల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధా కృష్ణకుమార్ (Radha Krishna Kumar) డైరెక్టర్. 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ విడుదల కాబోతుంది. ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపేందుకు ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఇంటెన్స్ లవ్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Radhe Shyam Pre release Event) టైంను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ పాన్ ఇండియా సినిమా ఈవెంట్ పెడుతోంది ఎక్కడో కాదు..మన హైదరాబాద్‌లోనే.
రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City)లో డిసెంబర్ 23న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. మరో ఆసక్తికర అప్ డేట్ ఏంటంటే రాధేశ్యామ్ ట్రైలర్‌ను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే లాంఛ్ చేయనున్నారు. అంతేకాదు రాధేశ్యామ్ ఈవెంట్ కోసం మేకర్స్ ఇతర ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేస్తున్నారట. టీ సిరీస్ ఫిలిమ్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై భూషణ్‌కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద యుక్తంగా నిర్మిస్తోన్నారు.
ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ టీజర్‌తోపాటు పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. జస్టిన్ ప్రభాకరణ్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో