Elon Musk | ఎలాన్ మస్క్ మళ్లీ ట్రిలియనీర్.. భారీగా పెరిగిన సంపద..!
Elon Musk | టెస్లా (Tesla), స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మళ్లీ ట్రిలియనీర్ (Trillianaire) అయ్యాడు. మూడు నెలల విరామం తర్వాత ఆయన సంపద మళ్లీ 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల విలువ గణనీయంగా పెరగడంతో సోమవారం ఒక్కరోజే ఆయన సంపద 65 బిలియన్ డాలర్లు పెరిగింది.
Elon Musk : టెస్లా (Tesla), స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మళ్లీ ట్రిలియనీర్ (Trillianaire) అయ్యాడు. మూడు నెలల విరామం తర్వాత ఆయన సంపద మళ్లీ 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల విలువ గణనీయంగా పెరగడంతో సోమవారం ఒక్కరోజే ఆయన సంపద 65 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Blumberg Billionairs Index) ప్రకారం.. మస్క్ ప్రస్తుత ఆస్తి విలువ 1.04 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది.
ఈ నెల ఆరంభం నుంచి స్పేస్ఎక్స్ షేర్లు 13 శాతం, టెస్లా షేర్లు 6.7 శాతం మేర లాభపడ్డాయి. దాంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్ (సుమారు 371.5 బిలియన్ డాలర్లు) సంపద కంటే మస్క్ ఆస్తి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ పెరుగుదల వెనుక స్పష్టమైన కారణాలు కూడా ఉన్నాయి.
స్పేస్ఎక్స్ కంపెనీలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ఇవ్వడం సానుకూల ప్రభావం చూపింది. దీనికి తోడు, ఇటీవల స్పేస్ఎక్స్ నిర్వహించిన ‘స్టార్‌షిప్’ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం కావడం కూడా షేర్ల విలువ పెరిగేందుకు దోహదపడింది. మరోవైపు టెస్లా కంపెనీ మూడో త్రైమాసికంలో అంచనాలకు మించి వాహనాలను డెలివరీ చేయడంతో శుక్రవారం నాడే మస్క్ సంపదకు 61 బిలియన్ డాలర్లు జత చేరాయి.
55 ఏళ్ల మస్క్ ఈ ఏడాది జూన్‌లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఆయన సంపద 1.45 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఆ తర్వాత షేర్ల విలువ పడిపోవడంతో జూలై చివరి నాటికి ఆయన సంపదలో 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కోత పడింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుని ట్రిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఏకైక వ్యక్తిగా నిలిచారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

