Sanjay Dutt No Peace in India | గాంధీ జయంతి సందర్భంగా యాంకర్ శేఖర్ సుమన్ నిర్వహించిన షోలో పాల్గోన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఇకపై తనకు శాంతి కనిపించడం లేదని ఆయన చేసిన కామెంట్లు పలు విమర్శలకు దారితీశాయి. ఈ వివాదంపై సంజయ్ దత్ వీడియో ద్వారా మరోసారి స్పష్టతనిచ్చారు. షోలో తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా స్క్రిప్టెడ్ షోలో భాగంగానే వచ్చాయని, వాటిని తన వ్యక్తిగత అభిప్రాయాలుగా భావించవద్దని ఆయన చేతులు జోడించి కోరారు. తన మాటలు ఎవరినైన ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలని, వాటి వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
షోలో మున్నాభాయ్ పాత్రలో భాగంగా రాజకీయ వ్యంగ్య సంభాషణల్లో భాగంగానే గాంధీజీ మూడు కోతుల ప్రస్తావన తెచ్చానని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తుంటే సరిదిద్దడానికి నాల్గవ కోతి ఎక్కడంటూ తాను చేసిన వ్యాఖ్యలు కేవలం వినోదం, వ్యంగ్యం కోసం మాత్రమేనని వివరించారు. తన మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, తన శ్రేయోభిలాషుల నమ్మకాన్ని తాను ఎప్పుడూ వమ్ము చేయనని తెలిపారు. మరోవైపు నటుడిగా సంజయ్ దత్ చివరిసారిగా మే నెలలో విడుదలైన ‘ఆఖ్రీ సవాల్’ రాజకీయ డ్రామా చిత్రంలో కనిపించారు. త్వరలో ఆయన ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ చిత్రంలో బల్లు పాత్రలో మరోసారి అలరించనున్నారు.