Nysa Devgan | హిందీలో మాట్లాడుతూ తడబడ్డ అజయ్ దేవ్గన్ కూతురు నైసా.. వీడియో
స్టార్ కిడ్ నైసా దేవ్గన్ (Nysa Devgan) తన భవిష్యత్ ప్రణాళిక ఏంటో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా కనిపిస్తుండే నైసాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
బాలీవుడ్ (Bollywood)లో ఉన్న పాపులర్, స్టైలిష్ స్టార్ కిడ్స్ జాబితాలో టాప్‌లో ఉంటుంది అజయ్ దేవ్గన్-కాజోల్ ముద్దుల కూతురు నైసా దేవ్గన్ (Nysa Devgan). ఈ స్టార్ కిడ్ తల్లితండ్రులను ఫాలో అవుతూ యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా..? లేదా..? అనే విషయంలో తన భవిష్యత్ ప్రణాళిక ఏంటో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా కనిపిస్తుండే నైసాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నైసా అహ్మద్‌నగర్‌లో నిరుపేద విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలను ప్రారంభించింది. పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేయడంతోపాటు స్పోర్ట్స్ కిట్స్‌ను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా చదువు ప్రాధాన్యతను గురించి హిందీలో చెబుతూ తడబడింది నైసా. నాకు చిన్నప్పటి నుంచి చదవడమంటే చాలా ఇష్టం.. అంటూ స్పీచ్ మొదలు పెట్టిన నైసా మధ్యలో మాట్లాడేందుకు తడబడింది. మీరు చదవడం అస్సలు ఆపవద్దు.. అని నిరుపేద చిన్నారులకు సూచించింది నైసా.
పేద విద్యార్థుల చదువు కోసం తన వంతు సహకారం అందిస్తున్న నైసా గొప్ప మనసుకు సలామ్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని గ్లియాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో నెట్టింట హల్ చల్ చేసే నైసా ఈ సారి మాత్రం సంప్రదాయ వస్త్రధారణలో ఈవెంట్‌కు హాజరై.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నైసా దేవ్గన్ హిందీ స్పీచ్.. వీడియో
The little speech of nysa devgan about importance of Education pic.twitter.com/MBvX06EZh3
— kamal shekhar (@kamalshekhar3) February 20, 2023
Read Also..
Ram Charan | ఇరవై రోజుల ముందే యూఎస్‌కు రాంచరణ్.. కారణమిదే..!
AK 62 | అజిత్‌తో నాలుగోసారి.. మరో హిట్టు పడ్డట్టేనా..?
Allu Aravind | అల్లు అర్జున్ను చూసి గర్వపడుతున్నా : అల్లు అరవింద్
Janhvi Kapoor | నీ కోసం ప్రతీ చోటా వెతుకుతున్నా అమ్మా.. జాన్వీకపూర్ భావోద్వేగ సందేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

