Allu Aravind | అల్లు అర్జున్ను చూసి గర్వపడుతున్నా : అల్లు అరవింద్
అల్లు అరవింద్ (Allu Aravind) కుమారుడు అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఎంట్రీ ఇచ్చి.. అల్లు రామలింగయ్య నటవారసత్వాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడని తెలిసిందే. తెలుగుతోపాటు మలయాళంలో సూపర్ క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. భారీ సంఖ్యలో అభిమానులను ఖాతాలో వేసుకున్నాడు బన్నీ.
టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించి.. వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు అల్లు అరవింద్ (Allu Aravind). ఈ సీనియర్ నిర్మాత కుమారుడు అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఎంట్రీ ఇచ్చి.. అల్లు రామలింగయ్య నటవారసత్వాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడని తెలిసిందే. తెలుగుతోపాటు మలయాళంలో సూపర్ క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. భారీ సంఖ్యలో అభిమానులను ఖాతాలో వేసుకున్నాడు బన్నీ.
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా అల్లు అర్జున్‌కు భారీగా ఫాలోవర్లను సంపాదించి పెట్టింది. ఎంతలా అంటే అల్లు అర్జున్ను చాలా కాలం వరకు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని చెప్పుకుంటున్నారు. ఈ మార్పును ప్రస్తుతం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఏ తండ్రికైనా కొడుకు మంచి పేరు ప్రఖ్యాతులు అందుకోవడం కన్నా గొప్ప బహుమతి ఏముంటుంది. ఇప్పుడు అలాంటి కానుకనే నాన్నకు ఇచ్చాడు బన్నీ.
తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు. ‘ఒకప్పుడు నేను బయటకు వెళ్లినప్పుడు నన్ను నిర్మాతగా గుర్తించేవారు. నా సినిమాలంటే ఇష్టమని చెప్పేవారు. కానీ ఇప్పుడు నేను బయటకు రాగానే చాలా మంది నా దగ్గరకు వచ్చి బన్నీ(అల్లు అర్జున్) గురించి అడుగుతున్నారు.
చాలా మంది నన్ను అల్లు అర్జున్ తండ్రిగా వారి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తున్నారు. ఈ విషయంలో నేను బన్నీని చూసి చాలా గర్వపడుతున్నాను. తండ్రికి తన పిల్లల విజయం కంటే గొప్ప బహుమతి ఇంకేం కావాలి? అని చెప్పుకొచ్చారు’ అల్లు అరవింద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

