మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 01, 2020 , 09:29:23

అవినాష్‌, మాస్ట‌ర్‌ని ఒంటి కాలిపై నిలుచోపెట్టిన నోయ‌ల్

అవినాష్‌, మాస్ట‌ర్‌ని ఒంటి కాలిపై నిలుచోపెట్టిన నోయ‌ల్

అనారోగ్యంతో బిగ్ బాస్ హౌజ్‌కు గుడ్‌బై చెప్పిన నోయ‌ల్‌కు శ‌నివారం ఎపిసోడ్‌లో సెండాఫ్ చెప్పారు. నాగార్జున‌తో స్టేజ్‌పంచుకున్న నోయ‌ల్ త‌న బాధ‌ని వివ‌రించారు. త‌న‌కు 'ఆంక్లియో స్పాంటిలైటిస్'‌ ఉంద‌ని చెప్పిన నోయ‌ల్‌, హౌస్‌లోకి వెళ్లిన మొద‌టి వారంలోనే కాళ్ల నొప్పి ప్రారంభ‌మైందని దాని వ‌ల‌న బ‌రువు అంతా రెండో కాలిపై పెట్ట‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నాడు. ఈ క్ర‌మంలో వేలు కూడా క‌ట్ అయింద‌ని చెప్పాడు. అయితే ఎంత క‌ష్టం ఉన్నా అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేస్తూ చాలా అద్భుతంగా గేమ్ ఆడావ‌ని నాగార్జున అన్నారు.

ఇక ఇంటి స‌భ్యుల ముందుకు వ‌చ్చిన నోయ‌ల్ అంద‌రికి హాయ్ చెబుతూ అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ ల‌ను ఒంటి కాలిపై నిలుచోమ‌ని అన్నాడు. అభి, హారిక‌, లాస్య టాప్ 5లో ఉంటార‌ని జోస్యం చెప్పాడు. ఒక్కొక్క‌రి గురించి మంచి చెడులు చెప్పిన నోయ‌ల్.. హారిక‌ను చాలా మిస్ అవుతున్న‌ట్టు పేర్కొన్నాడు. హారిక కూడా నోయ‌ల్ వెళ్ళిపోవ‌డంతో చాలా ఎమోష‌న‌ల్ అయింది.  ఇక త‌న బాధ‌ను వెట‌కారం చేసినందుకు రాజ‌శేఖ‌ర్, అవినాష్‌ల‌పై రెచ్చిపోయాడు నోయ‌ల్‌.

ఇద్ద‌రి కాళ్ళు నొప్పెట్టాయా అని అవినాష్‌, రాజ‌శేఖర్‌ల‌ని అడిగిన నోయ‌ల్‌, అంత‌క‌న్నా వెయ్యి రెట్ల బాధ ప్ర‌తి రోజు అనుభ‌విస్తున్నా అని పేర్కొన్నాడు.  "నాకు ఆంక్లియోస్పాటిలైసిస్ ఉంది. పొద్దున లేచాక అర‌గంట కాళ్లు స్ట్రెచ్ చేసుకుంటేనే న‌డ‌గ‌ల‌ను. దాన్ని మీరిద్ద‌రూ జోక్ చేస్తారేంటి?" అని నిల‌దీశాడు. మీరెమ‌న్నా జోక‌ర్సా అంటూ ఫైర్ అయ్యాడు. మీకు దెబ్బ తగిలిన‌ప్పుడు ఆ బాధ నాకు తెలుసు కాబ‌ట్టి ఎన్నో స‌పర్యయ‌లు చేశాను. కాని మీరు నా బాధని ఎగ‌తాళి చేశారు. టెంప‌ర‌రీ ఫ్రెండ్ అంటూ అంద‌రితో చెప్పుకొచ్చారు. ఈ  చిల్ల‌ర కామెడీలు ఎందుకు అంటూ నోయ‌ల్ అర‌వ‌డంతో అవినాష్ రెచ్చిపోయాడు  

నువ్వు వెళుతూ మా ఇద్ద‌రిని బ్యాడ్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టున్నావ్. నిన్ను ఇమిటేట్  చేసిన‌ప్పుడు న‌వ్వావ్‌. ఇప్పుడు త‌ప్పు అంటున్నావ్‌. చిల్లర కామెడీలు చేస్తే ఇక్క‌డి వ‌ర‌కు రాము. క‌ళామ్మ త‌ల్లి మీద ఒట్టేసి చెబుతున్నా నేనే ఏ రోజు ఒక‌రిని కించప‌రిచే విధంగా కామెడీలు చేయ‌లేదు అంటూ రెచ్చిపోయాడు. ఈ స‌మ‌యంలో అభిజీత్ క‌లుగజేసుకొని అత‌నికి మంచిగా సెండాఫ్ ఇద్దాం. ఇలా కొట్టుకునే స‌మ‌య‌మా అంటూ హిత‌వు పలికాడు. 

నాగార్జున మాట్లాడుతూ... హౌస్‌ నుంచి వెళ్లేవాళ్లు తమ ఫీలింగ్‌ని చెప్తారని అందులో నిజం ఉంటే తీసుకోండి లేదంటే వదిలేయండి అని అన్నారు. అయితే చివ‌రికి మాత్రం మోకాళ్ల‌పై మోక‌రిల్లి రెండు చేతులు జోడించి సారీ చెప్పాడు. త‌ప్పు చేసి సారీ చెప్ప‌డం పెద్ద‌రికం కాదని నోయ‌ల్ చెంప‌పెట్టుగా స‌మాధాన‌మిచ్చాడు. ఇక వెళ్ళే ముందు లాస్య‌ని సేవ్ చేసి బిగ్ బాస్ ని వీడారు నోయ‌ల్‌. ఇక ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో అమ్మా రాజ‌శేఖ‌ర్, మెహ‌బూబ్, అరియానా, మోనాల్ ఉండ‌గా వీరిలో ఒక‌రు నేడు ఎలిమినేట్ కానున్నారు.


logo