Vinod Kumar | రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్ల డ్రామాలాడుతున్నారు : వినోద్ కుమార్
Vinod Kumar | రిజర్వేషన్లు తీసే హక్కు ఎవరికి లేదని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు.
హైదరాబాద్ : రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్ ఎస్సీ, ఏస్టీ రిజర్వేషన్లు తీసేస్తారని అంటున్నారు. మరో వైపు బీజేపీ వాళ్లు కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్లు(Reservations) రద్దు చేసి ముస్లింలకు ఇస్తారని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రిజర్వేషన్లు తీసే హక్కు ఎవరికి లేదని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాలు వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో కలిసి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మాణం చేసిన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు,125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులని, వాటిని రద్దు చేసే హక్కు ఎవరికి లేదని పేర్కొన్నారు. వీటిని ముట్టరాదని 2006లో సుప్రీంకోర్టు జడ్జి తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయాల కోసమే(Parliament eletions) ఈ ప్రస్తావన తెస్తున్నాయని మండిపడ్డారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించాలని..ప్రతి సమస్యపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు కనవుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్, వంతడుపుల సంపత్, సాంబారి కొమురయ్య, క్యాదాసు ప్రభాకర్, బీమారపు సతీష్, పారునంది జలపతి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

