Niharika Divorce | నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే వీళ్లిద్దరూ విడిపోయారు. మే 19వ తేదీన కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు చేసుకోగా.. న్యాయస్థానం వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్లో వివాహం జరిగింది. ఉదయ్‌పూర్ వేదికగా వీళ్ల పెళ్లిని మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జరిపించింది. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే వీరిద్దరి మధ్య చెడినట్లు వార్తలు వచ్చాయి. తొందరలోనే విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. పైగా ఇద్దరూ సపరేట్గా ఉండటంతో విడాకులు తీసుకోవడం ఖాయమే అని గుసగుసలు వినిపించాయి. ఫిలిం ఇండస్ట్రీలో దీనిపై ఎంత చర్చ జరిగినా అటు నిహారిక దంపతులు కానీ.. మెగా ఫ్యామిలీ కానీ స్పందించలేదు. దీంతో అవన్నీ వట్టి పుకార్లే కావచ్చని మెగా ఫ్యాన్స్ సర్దిచెప్పుకున్నారు. కానీ మొన్నటికి మొన్న వరుణ్‌తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కూడా చైతన్య అటెండ్ కాలేదు. నిహారిక ఒక్కటే నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంది. ఇంటి అల్లుడు అయ్యి ఉండి బామ్మర్ది ఎంగేజ్మెంట్కు రాలేదంటే నిహారిక-చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకోవడం నిజమేనని అంతా ఫిక్సయిపోయారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. మే 19న వీరిద్దరూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరికీ మ్యుచువల్ డైవర్స్ మంజూరు చేసింది. జూన్ 5వ తేదీనే నిహారిక, చైతన్య విడాకుల ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.
Salaar Teaser | ప్రశాంత్ నీల్ మామూలోడు కాదుగా.. సలార్‌కు కేజీఎఫ్‌కు భలే ముడిపెట్టాడు!!
Karthik Aaryan | అప్పుడే కొత్త సినిమాను ప్రకటించిన కార్తిక్ ఆర్యన్.. ఆసక్తికరంగా టైటిల్ పోస్టర్