Mangalavaaram Movie | ఉత్కంఠ రేకెత్తిస్తున్న మంగళవారం టీజర్.. అజయ్ భూపతి ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు..!
Mangalavaaram Movie Teaser | పల్లెటూరి నేపథ్యంలో ఒక రా, రస్టిక్ లవ్‌స్టోరీ వంటి ఆర్ఎక్స్100తో నిర్మాతలకు పదింతలు లాభం తెచ్చిపెట్టాడు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్‌తో తెరకెక్కించిన మల్టిస్టారర్ ‘మహాసముద్రం’ తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అల్ట్రా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
Mangalavaaram Movie Teaser | ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఆర్ఎక్స్100’ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న కార్తికేయకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ నటనతో యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమా కర్త, కర్మ, క్రియ అయిన అజయ్ భూపతి ఒక్క సారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. పల్లెటూరి నేపథ్యంలో ఒక రా, రస్టిక్ లవ్‌స్టోరీతో నిర్మాతలకు పదింతలు లాభం తెచ్చిపెట్టాడు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్‌తో తెరకెక్కించిన మల్టిస్టారర్ ‘మహాసముద్రం’ తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అల్ట్రా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
ఇక ఇప్పుడు మంగళవారం అనే థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై తిరుగులేని బజ్ ఏర్పడింది.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు కానీ.. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇద్దరి శవాలను చూపిస్తూ మొదలైన టీజర్ ఆ తర్వాత అమ్మవారి గుడిని చూపిస్తూ ఊర్లో ఏదో జరుగుతుందన్న క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇక టీజర్లో అందరూ భయపడుతూ పైకి చూడటం.. మెయిన్‌గా ప్రతీ షాట్లో కళ్లనే హైలెట్ చేస్తూ చూపించడం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక టీజర్లో ఓ వ్యక్తి అమ్మవారి మాస్క్‌ను తీసుకుని చూపించినట్లు కనిపించింది. చివర్లో పాయల్ గట్టిగా అరవడం, భయంగా చూడటం వంటివి వణుకు పుట్టిస్తున్నాయి. మొత్తంగా అజయ్ భూపతి ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
టీజర్లో మేయిన్‌గా అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. నందిత శ్వేత, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇక అజయ్ ఈ సినిమాను ముద్ర మీడియా, ఏ క్రియేటీవ్ వర్క్స్‌తో కలిసి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

