Shah Rukh Khan | బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్‌కు ఓ సినిమా సెట్లో గాయపడ్డాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో ఓ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. కాగా ఈ షూటింగ్లో ఓ సీన్ చేస్తుండగా ముక్కుకి దెబ్బ తగిలి రక్తి కారినట్లు తెలుస్తుంది. వెంటనే చిత్రబృందం షారుఖ్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స జరిపిస్తున్నారట. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రక్తం ఆగడానికి చిన్న సర్జరీ చేసినట్లు డాక్టర్లు తెలిపినట్లు సమాచారం. కాగా దీనిపై షారుఖ్ బృందం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఇక షారుఖ్ ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఏడాది పఠాన్‌తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో షారుఖ్ వెయ్యి కోట్ల క్లబ్లో ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా దంగల్ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్లో నిలిచిన హిందీ సినిమా ఇదే. మిక్స్డ్ టాక్‌తోనే ఈ రేంజ్లో కలెక్షన్లు సాధించిందంటే షారుఖ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం షారుఖ్ నటించిన జవాన్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై హిందీతో పాటు దక్షిణాదిన కూడా మంచి హైప్ ఉంది. ఇక దీనితో పాటుగా షారుఖ్, రాజ్ కుమార్ హిరానీతో డుంకీ సినిమా చేస్తున్నాడు.