Sitara Ghattamaneni | టైమ్స్ స్క్వేర్‌లో సితార.. మురిసిపోతున్న మహేష్ బాబు..!
Maheshbabu Daughter| సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సితారకు సంబంధించిన పలు డ్యాన్స్ వీడియోలు మహేష్ భార్య నమ్రత పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవి క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి.
Maheshbabu Daughter| సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. సితారకు సంబంధించిన పలు డ్యాన్స్ వీడియోలు మహేష్ భార్య నమ్రత పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవి క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. అంతేకాకుండా సితార ఓ యూట్యూబ్ చానెల్‌ను కూడా రన్ చేస్తుంది. ఇలా చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయికగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ మధ్య మహేష్‌తో కలిసి పలు షోలకు అటెండ్ అవుతూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సితార మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్‌ని సృష్టించింది. రీసెంట్‌గానే దీనికి సంబంధించిన యాడ్‌ను షూట్ చేశారు. కాగా.. ఇప్పుడు ఈ యాడ్‌కు సంబంధించిన ఫొటోలను ప్రెస్టీజియస్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత చిన్న వయసులోనే సితార ఇలాంటి ఘనత సాధించడంతో మహేష్ మురిసిపోతున్నాడు. సితారను చూస్తే గర్వంగా ఉందని ఈ ఫోటోలను అభిమనులతో పంచుకున్నాడు.
Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy
— Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

