టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో వస్తున్న చిత్రం లైగర్ (Liger). బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్యపాండే (Ananya Pandey) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. నేడు ముంబైలో లైగర్ షూటింగ్ జరిగింది. విజయ్, అనన్యపై వచ్చే సాంగ్ షూట్ చేసినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. షూటింగ్ మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది పూరీ టీం.
మల్టీలింగ్యువల్ ప్రాజెక్టులో రమ్యకృష్ణ కీ రోల్ చేస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న లైగర్‌ను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. లైగర్‌లో వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ రోల్లో నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలోగ్రాండ్గా విడుదల కాబోతుంది.