టాలీవుడ్ న్యాచురల్ స్టార్ హీరో నాని (nani) రీసెంట్గా అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. నాని ప్రస్తుతం దసరా (Dasara) ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. చాన్నాళ్ల క్రితమే షురూ అయిన దసరా చిత్రం షూట్‌కు మధ్యలో బ్రేక్ పడ్డది. ఇక నెక్ట్స్ షెడ్యూల్ షురూ కానుంది. నాని గోవా ట్రిప్ నుంచి తిరగొచ్చాడట. నాని ప్రస్తుతం దసరా షూటింగ్ మూడ్‌లోకి వచ్చేసినట్టు ఓవార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
నాని షూటింగ్‌ను రీస్టార్ట్ చేశాడని ఇన్సైడ్ టాక్. వీలైనంత త్వరగా దసరా చిత్రీకరణ పూర్తి చేసి..ఈ ఏడాది చివరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దసరా మూవీకి సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు.