బజార్ సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది టబు (Tabu) . ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ కూలీ నంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. టబు సింగిల్‌గా సంతోషకర ప్రయాణాన్ని సాగిస్తోంది. ఈ బ్యూటీ ఓ చిట్ చాట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్(Ajay Devgn)తో రిలేషన్‌షిప్‌పై చేసిన కామెంట్స్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.
అయితే టబు ఫన్నీ యాంగిల్లో ఈ కామెంట్స్ చేయడంతో లైట్ తీసుకుంటున్నారు సినీజనాలు. అజయ్ దేవ్గన్తో రిలేషన్‌షిప్‌పై స్పందిస్తూ..తాను సింగిల్‌గా ఉండటానికి కారణం అతడేనంది. నా కజిన్ సమీర్‌కు అజయ్ దేవ్గన్ చాలా దగ్గరి వ్యక్తి. నేను యంగ్ ఏజ్‌లో ఉన్నపుడు సమీర్ (Sameer), అజయ్ నాపై నిఘా పెట్టేవారు. నన్ను ఫాలో అయ్యేవారు. నాతో మాట్లాడిన అబ్బాయిలు కనపడితే..కొడతామని బెదిరించేవారు. ఈ రోజు నేను సింగిల్‌గా ఉన్నానంటే దానిక్కారణం అజయేనని నవ్వుతూ చెప్పుకొచ్చింది టబు.
ఈ సీనియర్ నటి ప్రస్తుతం మలయాళం క్రైం థ్రిల్లర్ హిందీ రీమేక్ దృశ్యం 2లో నటిస్తుండగా..నవంబర్ 18న విడుదల కానుంది. టబు కీ రోల్ చేస్తున్న మరో తమిళ రీమేక్ భోళా 2023 మార్చి 30లో విడుదల కానుంది.