Unstoppable Season 2 | బాలకృష్ణ డబుల్ ఎంటర్టైన్ మెంట్..గెట్ రెడీ
ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK) ఫన్ టాక్ షోకు ఆహ్వానిస్తూ..వారితో సరదా సంభాషిస్తూ..టైటిల్‌కు ఏమాత్రం తగ్గకుండా అన్ స్టాప్బుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించాడు బాలకృష్ణ. ఇపుడు మరోసారి అన్‌స్టాపబుల్ సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలకృష్ణ.
నందమూరి స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) ఇప్పటికే ఆహా ప్లాట్‌ఫాంలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK) ఫన్ టాక్ షోతో సందడి చేశాడని ప్రత్యేకించి చెప్వనవసరం లేదు. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను షోకు ఆహ్వానిస్తూ..వారితో సరదా సంభాషిస్తూ..టైటిల్‌కు ఏమాత్రం తగ్గకుండా అన్ స్టాప్బుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించాడు. ఇపుడు మరోసారి అన్‌స్టాపబుల్ సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలకృష్ణ.
త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ షోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆగస్టు 15న రాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. రెండో సీజన్లో రాబోయే మొదటి సెలబ్రిటీ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అని టాక్ నడుస్తుండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న ఎన్బీకే107 ప్రాజెక్టు షూటింగ్ దశలో ఉంది.
ఈ ఇద్దరు స్టార్ హీరోలు మళ్లీ ఒకే స్టేజీపై కనిపించబోతున్నారన్న వార్త ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇటు మెగా, అటు నందమూరి అభిమానుల కోరిక తీరనుందా..? లేదా అనేది అధికారిక ప్రకటన వస్తే తెలిసే అవకాశముంది. ఫస్ట్ సీజన్లో ఇప్పటికే మహేశ్ బాబు, నాని, బ్రహ్మానందం, పూరీ జగన్నాథ్, ఛార్మీతోపాటు పలువురు టాప్ సెలబ్రిటీలు సందడి చేశారు. సెకండ్ సీజన్లో ఎవరెవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : Chinmayi Sripada | కవల పిల్లలకు చిన్మయి శ్రీపాద వెల్కమ్..పోస్ట్‌తో గాసిప్స్ కు చెక్
Read Also : Chiru Salman party | పార్టీలో చిరు-వెంకీ-సల్మాన్ సందడి..ఇంతకీ స్పెషలేంటో..?
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

