తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని యాక్టర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence). ఈ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రీసెంట్గా పీ వాసు డైరెక్షన్లో చంద్రముఖి 2 (Chandramukhi 2) ప్రకటించిన విషయం తెలిసిందే. రాఘవా లారెన్స్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ హీరో కథిరేశన్ (Kathiresan) డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నటిస్తున్న తాజా చిత్రం రుద్రుడు (Rudhrudu). ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ (Rudhrudu 1st Look) ను మేకర్స్ విడుదల చేశారు.
రాఘవాలారెన్స్ ఓ చేతిలో ఐరన్ రాడ్ పట్టుకుని..మరో చేతిలో రౌడీ తల వెంట్రుకలు పట్టుకుని ఫుల్ యాక్షన్ మూడ్‌లో స్టన్నింగ్ లుక్‌తో అదరగొడుతున్నాడు. చెడు అనేది బోర్డు కాదు..సృష్టించబడింది అనే ట్యాగ్‌లైన్ ఈ చిత్రంలో రాఘవా లారెన్స్ పాత్ర గురించి హింట్ ఇస్తోంది. రుద్రుడు చిత్రంలో ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా..షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఓ వైపు చంద్రముఖి 2, ఇంకో వైపు రుద్రుడు లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలతో గెట్ రెడీ టు సీ ఇన్ థియేటర్స్ అంటున్నాడు.
#RudhranFirstlook https://t.co/oQWTEhjf2l
— Raghava Lawrence (@offl_Lawrence) June 23, 2022