ఆకాశ్‌పూరీ (Akash Puri) హీరోగా నటించిన లేటెస్ ప్రాజెక్టు చోర్ బజార్ (Chor Bazaar). జార్జిరెడ్డి ఫేం జీవన్ రెడ్డి (B.Jeevan Reddy) డైరెక్ట్ చేసిన ఈచిత్రం నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రంలో బచ్చన్ సాబ్ పాత్రలో కనిపించాడు ఆకాశ్ పూరీ. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌కు డెడికేట్ చేస్తూ మేకర్స్ రీసెంట్గా బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథెమ్‌ను రిలీజ్ చేయగా..అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ చేసిన ట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఎనర్జిటిక్ బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథెమ్ సాంగ్‌పై లుక్కేయండి బచ్చన్ సార్జీ అంటూ ఓ ట్విటర్ యూజర్ వీడియోను ట్యాగ్ చేశాడు. దీనికి బిగ్ బీ స్పందిస్తూ..ఉఫ్ ఏం చెప్పాలి..చాలా సంతోషకరంగా ఉంది..మై లవ్, రెస్పెక్ట్ అంటూ రీట్వీట్ చేశారు. బిగ్ బీ ట్వీట్‌తో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చోర్ బజార్లో గెహనా సిప్పి (Gehnna Sippy) హీరోయిన్గా నటించింది.
ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్ తెచ్చుకుంటోంది. సురేష్ బోబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రల్లో నటించగా…సినిమాకుకలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో రానున్న రోజుల్లో తెలియనుంది. వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీఎస్ రాజు నిర్మించారు.
uffff .. what to say .. this is so gratifying .. my love and respect .. ❤️❤️❤️🙏🙏🙏 https://t.co/5X0BRlVRgK
— Amitabh Bachchan (@SrBachchan) June 23, 2022