అబ్బాయా..అబ్బాయా..అంటూ యమదొంగ (Yamadonga)సినిమాలో చక్కిలిగింతలు పెట్టిన మాలీవుడ్ బ్యూటీ మమతా మోహన్‌దాస్ (Mamata Mohan Das) గురించి సినీ లవర్స్ కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగులో కేడీ, కింగ్, చింతకాయల రవితోపాటు పలు చిత్రాల్లో మెరిసిన ఈ భామ ప్రస్తుతం మాలీవుడ్ (Mollywood)కే పరిమితమైపోయింది. ఈ బ్యూటీ వరల్డ్ ఫేవరేట్ టూరిజం స్పాట్ మాల్దీవుల్లో (Maldives beaches) షికారు చేస్తోంది.
ఫ్లోరల్ డిజైన్డ్ బీచ్ వేర్లో హొయలు పోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. మీరు బీచ్‌లో ప్రతిదానికీ నివారణను కనుగొంటారు. ఉప్పులో, సూర్యుని క్రింద, ఇసుక మీద మీ అంతర్గత శాంతి ఇమిడి ఉంటుంది..అంటూ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. రీసెంట్గా వచ్చిన మలయాళ హిట్ చిత్రం జనగణమనలో మెరిసింది మమతామోహన్ దాస్.
చిన్న పాత్ర అయినా తన పర్ ఫార్మెన్స్ తో జనగణమనలో ఆడియెన్స్ ను థ్రిల్‌కు గురిచేసింది. కమర్షియల్ ఫిలిమ్స్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి తెలుగు నుంచి ఎలాంటి ఆఫర్లు రావడం లేదట.