మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 18:06:08

సుశాంత్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

సుశాంత్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలుత సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు భావించినా..ఆ తర్వాత ఇది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా హత్యే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్‌ సన్నిహితులు దీన్ని హత్యే అని చెప్పారు. అయితే సుశాంత్‌ మృతదేహాన్ని ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లిన అంబులెన్స్‌ సహాయకుడు చెప్పిన మాటలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.

సుశాంత్‌ మృతదేహాన్ని మొదట చూసినపుడు పసుపుపచ్చ రంగులో ఉంది. ఒకవేళ ఉరివేసుకుంటే శరీరం రంగు మారదు. నోటి నుంచి నురగ వస్తుంది. కానీ నేను సుశాంత్‌ బాడీపై ఎలాంటి నురగ చూడలేదు. ఎవరైనా ఉరివేసుకుంటే మెడచుట్టూ గుర్తులుంటాయి. కానీ కేవలం ముందుభాగంలో మాత్రంలో గుర్తు కనిపించింది. అంతేకాదు సుశాంత్‌ కాళ్లు వంగి ఉన్నాయి. ఎవరైనా ఉరేసుకుంటే కాళ్లు ఎలా వంగిపోతాయి. సుశాంత్‌ కాలిపై నాకు ఓ గుర్తు కనిపించిందని చెప్పుకొచ్చాడు. సహాయకుడు చెప్పిన మాటలు బట్టి చూస్తే సుశాంత్‌ హత్య ఉంటుందనే అనుమానాలు వస్తున్నాయి. సుశాంత్‌ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo